Hyderabad: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం.. విషయం ఏంటంటే..

ABN, Publish Date - Dec 07 , 2024 | 06:07 PM

తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈనెల 9న సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందజేశారు.

Hyderabad: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం.. విషయం ఏంటంటే.. 1/8

తెలంగాణ సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది.

Hyderabad: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం.. విషయం ఏంటంటే.. 2/8

డిసెంబర్ 9న నిర్వహించే విగ్రహావిష్కణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందజేశారు.

Hyderabad: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం.. విషయం ఏంటంటే.. 3/8

ముందుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న మంత్రి బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వాగతం పలికారు.

Hyderabad: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం.. విషయం ఏంటంటే.. 4/8

తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నంను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆప్యాయంగా పలకరించగా.. మంత్రి పొన్నం సైతం కేసీఆర్‌ను పలకరించారు.

Hyderabad: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం.. విషయం ఏంటంటే.. 5/8

అనంతరం బీఆర్ఎస్ అధినేతను మంత్రి పొన్నం బృందం శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఆ తర్వాత కాసేపు నేతలంతా ముచ్చటించారు.

Hyderabad: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం.. విషయం ఏంటంటే.. 6/8

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు.

Hyderabad: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం.. విషయం ఏంటంటే.. 7/8

కేసీఆర్ ఇంట్లో భోజనం చేసిన మంత్రి పొన్నం అనంతరం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 9న జరిగే కార్యక్రమానికి తప్పకుండా రావాలంటూ ఆహ్వానించారు.

Hyderabad: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం.. విషయం ఏంటంటే.. 8/8

అయితే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్తారా లేదా? అనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.

Updated at - Dec 07 , 2024 | 06:07 PM