Share News

AP Elections: చంద్రబాబు, మోదీ.. పవన్‌లకు థ్యాంక్స్ చెప్పిన వైసీపీ.. ఎందుకంటే..?

ABN , Publish Date - Apr 09 , 2024 | 06:58 PM

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా వలంటీర్ల (Volunteer System) చుట్టూనే తిరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Reddy) తీసుకొచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థపై ఎన్నెన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎన్నికల టైమ్‌లో ఇదే వ్యవస్థపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది...

AP Elections: చంద్రబాబు, మోదీ.. పవన్‌లకు థ్యాంక్స్ చెప్పిన వైసీపీ.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా వలంటీర్ల (Volunteer System) చుట్టూనే తిరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Reddy) తీసుకొచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థపై ఎన్నెన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎన్నికల టైమ్‌లో ఇదే వ్యవస్థపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. పెన్షన్ల పంపిణీ వలంటీర్లతో చేయడానికి వీల్లేదని.. కేంద్ర ఎన్నికల కమిషన్ క్లియర్ కట్‌గా ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాజీనామాలు, వైసీపీ కోసం పనిచేస్తుండటం ఇలా పెద్ద హైడ్రామానే నడుస్తోంది. దీనికి తోడు రాజీనామా చేసే వాళ్లు చేసేయండి.. అధికారంలోకి రాగానే తొలి సంతకం వలంటీర్ల వ్యవస్థపైనే పెడతానని కూడా జగన్ చెబుతున్నారు. మరోవైపు.. కూటమి అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. ఉద్యోగులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. అంతేకాదు.. వలంటీర్లకు భరోసా ఇవ్వడానికి వారి గౌరవ వేతనాన్ని 10 వేల రూపాయిలు చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఉగాది పండుగ నాడు వలంటీర్లకు ఈ శుభవార్త చెప్పారు బాబు.

టీడీపీ అభ్యర్థి ఫరూక్‌కు తప్పిన ప్రమాదం


Modi-and-pawan-and-Babu.jpg

ఏం జరిగింది..?

వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు చేసిన కామెంట్స్‌, గౌరవ వేతనంపై ట్విట్టర్ వేదికగా వైసీపీ స్పందించింది. ‘ వలంటీర్ వ్యవస్థ శక్తిని గుర్తించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ, జననసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు. ఇది జగనన్న పాలనా విజయానికి నిదర్శనం. అందుకే విపక్షాలు కూడా ఆదరించి, పాటించాలని అనుకునేలా చేసింది. మీరేం చింతించకండి.. జూన్-04న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తాం’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది వైసీపీ. దీనిపై టీడీపీ శ్రేణులు.. వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానుల మధ్య కామెంట్ల యుద్ధం నడుస్తోంది.


jagan2.jpg

నేనున్నా.. మాటిస్తున్నా..!

కాగా.. అంతకుముందు చంద్రబాబు కూడా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. వలంటీర్లూ.. తన రాజకీయ స్వార్థం కోసం మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్న వైఎస్ జగన్ మాయ మాటలను నమ్మకండి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వలంటీర్లుగా మిమ్మల్నే కొనసాగించడమే కాదు.. మీ గౌరవ వేతనాన్ని రూ. 10 వేలు చేస్తాంఅని ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఈ ట్వీట్‌కు ఉగాది సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన వీడియోను యాడ్ చేయడం జరిగింది. ఈ ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ వైసీపీ పై విధంగా స్పందించింది. ఇదిలా ఉంటే.. కూటమి అధికారంలోకి వస్తే.. వలంటీర్లను తొలగిస్తామంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కూడా చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని.. కొనసాగిస్తామని తెలిపారు.

Babu-On-Volunteers.jpg

మరిన్ని రాజకీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2024 | 07:08 PM