Share News

Viral Video: ఇంత ట్యాలెంట్ ఉన్న అమ్మాయిని జైళ్లో పెట్టాలి.. యువతి ప్రమాదకర స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..!

ABN , Publish Date - Jun 19 , 2024 | 12:42 PM

సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేందుకు ఈ రోజుల్లో యువత ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఎలాంటి భయం, బిడియం లేకుండా విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆ క్రమంలో వారు ఇబ్బందులు పడుతున్నారు లేదా ఇతరులను ఇబ్బందులు పెడుతున్నారు.

Viral Video: ఇంత ట్యాలెంట్ ఉన్న అమ్మాయిని జైళ్లో పెట్టాలి.. యువతి ప్రమాదకర స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..!
Bike stunt

సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేందుకు ఈ రోజుల్లో యువత ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఎలాంటి భయం, బిడియం లేకుండా విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆ క్రమంలో వారు ఇబ్బందులు పడుతున్నారు లేదా ఇతరులను ఇబ్బందులు పెడుతున్నారు. ఇన్‌‌స్టాగ్రామ్ రీల్ (Reels) కోసం తాజాగా ఓ అమ్మాయి (Young Woman) చేసిన సాహసం (Bike stunt Video) చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆమె గుండె ధైర్యానికి ఆశ్చర్యపోవాల్సిందే (Viral Video).


@peepoye అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో పసుపు టీ షర్ట్ ధరించిన ఓ యువతి ప్రమాదకర బైక్ స్టంట్ చేసింది. వేగంగా వెళుతున్న బైక్‌పై ఒకవైపు కూర్చుని రకరకాల స్టిల్స్ ఇచ్చింది. ఆ సమయంలో ఆమె బైక్ హ్యాండిల్‌ పట్టుకోలేదు. బైక్ వేగంగా తన మానన తను వెళుతూ ఉంటే ఆమె సీటు మీద కూర్చుని రకరకాల ఫోజులు ఇస్తోంది. ఆమె చేష్టలను వేరే వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను పుణెలో చిత్రీకరించారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 7 వేల మంది చూశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నేటి యువతకు చాలా నైపుణ్యాలు ఉన్నాయి. వాటిని వ్యక్తికరించే పద్ధతులు బాగోలేవు``, ``ఈ అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేయాలి``, ``పుణె ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఐ ఎలాంటి చర్యలు తీసుకోవాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: స్టూడెంట్స్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న టీచర్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!


Puzzle: మీరు ఎంతో తెలివైన వారైతే తప్ప ఈ ఫొటోలోని రెండో వ్యక్తిని కనిపెట్టలేరు.. ఒకసారి ప్రయత్నించండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 19 , 2024 | 12:42 PM