Share News

Viral Video: రీల్ చేద్దామనుకుని ఏనుగుకు దొరికిపోయాడు.. ఒక్క దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు.. వీడియో వైరల్!

ABN , Publish Date - Jun 14 , 2024 | 11:55 AM

ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతి చిన్న ఘటనను కెమేరాలో బంధించడం అలవాటైంది. అలాగే రీల్స్ మోజులో పడి ఏం చేస్తున్నామో గుర్తించలేకపోతున్నారు. రీల్స్ కోసం అనవసర రిస్క్‌లు చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ యువకుడు అడవి ఏనుగుతో రీల్ చేయడానికి ప్రయత్నించి దానికి దొరికిపోయాడు.

Viral Video: రీల్ చేద్దామనుకుని ఏనుగుకు దొరికిపోయాడు.. ఒక్క దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు.. వీడియో వైరల్!
Wild Elephant

ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతి చిన్న ఘటనను కెమేరాలో బంధించడం అలవాటైంది. అలాగే రీల్స్ (Instagram reels) మోజులో పడి ఏం చేస్తున్నామో గుర్తించలేకపోతున్నారు. రీల్స్ కోసం అనవసర రిస్క్‌లు చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ యువకుడు అడవి ఏనుగు (Wild Elephant)తో రీల్ చేయడానికి ప్రయత్నించి దానికి దొరికిపోయాడు. అది తొండంతో ఒక్క విసురు విసరడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బిజ్నోర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఓ అడవి ఏనుగు బిజ్నోర్‌లోని పలు గ్రామాల్లో హల్‌చల్ చేసింది. హబీబావాలా గ్రామంలోకి ప్రవేశించింది. ఆ ఏనుగును చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు వెళ్లారు. బాగ్దాద్ అన్సార్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల ముర్సాలీన్‌ కూడా అక్కడకు వెళ్లాడు. ఆ ఏనుగుతో రీల్ చేయాలనుకున్నాడు. ఆ ఏనుగు సమీపానికి వెళ్లి దానిని భయపెట్టాలనుకున్నాడు. దానిని తరిమేందుకు ప్రయత్నించాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఏనుగు ముర్సాలిన్ వెంట పడింది (Wild Elephant Killed UP Man).


ముర్సాలిన్‌తో పాటు గ్రామస్థులందరూ పరుగులు తీశారు. వేగంగా పరిగెత్తిన ఏనుగు ముర్సాలిన్‌ను సమీపించి అతడిని కాలితో తొక్కేసింది. అనంతరం తొండంతో 25 అడుగుల ఎత్తుకు విసిరికొట్టింది. తీవ్ర గాయాలపాలైన ముర్సాలిన్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ముర్సాలిన్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఏనుగు తిరిగి అడవిలోకి పంపించేశారు. కాగా, ఏనుగు నుంచి తప్పించుకునేందుకు ముర్సాలిన్, వీడియో తీస్తున్న వ్యక్తి పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ ఐక్యూకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిలో ఎవరు రోగిగా నటిస్తున్నారో చెప్పండి..!


Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి టెస్ట్.. ఈ ఫొటోలో కాస్త భిన్నంగా ఉన్న కేక్‌ను 10 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 14 , 2024 | 11:58 AM