Viral video: ఏసీతో నీటి సమస్యకు చెక్.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న టెక్నిక్..
ABN , Publish Date - Mar 21 , 2024 | 05:23 PM
వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఉత్పన్నమవుతుంటుంది. దీన్నుంచి బయటపడేందుకు కొందరు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు...
వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఉత్పన్నమవుతుంటుంది. దీన్నుంచి బయటపడేందుకు కొందరు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు నీటి వృథా కాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇలాంటి ప్రస్తుత తరుణంలో ప్రముఖ వ్యాపారావేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో.. నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. బెంగళూరులో నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ఏసీ వృథా నీటిని సద్వినియోగం చేసుకున్న తీరు.. ఆనందర్ మహీంద్రాకు తెగ నచ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా (Businessman Anand Mahindra) షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరు (Bangalore) నగరంలో కొందరు తమ ఇళ్లకు ఏర్పాటు చేసిన ఏసీతో నీటి సమస్యకు పరిష్కార మార్గం వెతుక్కున్నారు. ఏసీ నుంచి వృథాగా (Air-Conditioner waste water) వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకున్నారు. ఇందుకోసం వారు ఏసీ నుంచి పైపును ఏర్పాటు చేసి, కింద కొళాయికి కనెక్షన్ ఇచ్చారు. తద్వారా ఏసీ నుంచి వెలువడే వృథా నీరంతా కొళాయి వద్దకు చేరుకుంటుంది.
ఈ వృథా నీటిని ఇంటి యజమానులు పాత్రలు శుభ్రం చేసుకోవడం, చెట్లకు ఉపయోగిస్తుంటారు. ఈ టెక్నిక్ ఆనంద్ మహీంద్రాను తెగ ఆకట్టుకుంది. వెంటనే ఈ వీడియోను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ‘‘ఏసీలు ఉపయోగించే వారంతా ఇలా చేయడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చు’’.. అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చాలా మంచి ఆలోచన’’.. అంటూ కొందరు, ‘‘నీటి సమస్య ఉన్న బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఇలాంటి టెక్నిక్ ఎంతో ఉపయోగపడుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Women: డెలివరీ బాయ్‌ను వాష్ రూంలోకి తీసుకెళ్లిన మహిళ.. కాసేపటికి వంటగదిలోకి వెళ్లగా..