Viral: క్యాన్సిల్ చేసిన రెండేళ్ల తర్వాత ఆర్డర్ డెలివరీ.. యూజర్ ట్వీట్‌పై అమెజాన్ స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Aug 31 , 2024 | 09:06 PM
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ షాపింగ్ బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చుని ఆర్డర్ చేస్తే చాలు ఆ వస్తువు నాలుగు, ఐదు రోజుల్లో మన కాళ్ల దగ్గరకే వచ్చేస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నాయి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ షాపింగ్ (Online Shopping) బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చుని ఆర్డర్ చేస్తే చాలు ఆ వస్తువు నాలుగు, ఐదు రోజుల్లో మన కాళ్ల దగ్గరకే వచ్చేస్తోంది. అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నాయి. అయితే అప్పుడప్పుడు ఆయా సంస్థలు కూడా కొన్ని పొరపాట్లు చేస్తుంటాయి. ఆర్డర్ చేసిన వస్తువును సకాలంలో డెలివరీ చేయలేకపోవడం, ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు వేరొకటి డెలివరీ చేయడం, పాడైపోయిన ఉత్పత్తులు పంపడం వంటివి అప్పుడప్పుడు జరుగుతున్నాయి. అయితే జయ్ అనే ఓ యూజర్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది (Viral News).
జయ్ రెండేళ్ల క్రితం అంటే 2022 అక్టోబర్ 1వ తేదీన అమెజాన్ ద్వారా ప్రెజర్ కుక్కర్ ఆర్డర్ చేశాడు. అయితే తర్వాత మనసు మార్చుకుని ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశాడు. వెంటనే అతడికి అమెజాన్ సంస్థ డబ్బులను రీఫండ్ కూడా చేసింది. అయితే ఆశ్చర్యకరంగా అతడికి తాజాగా అమెజాన్ నుంచి ఆ ప్రెజర్ కుక్కర్ పార్సిల్ వచ్చింది. క్యాన్సిల్ చేసిన రెండేళ్ల తర్వాత అతడికి ఆర్డర్‌ను (Cancelled order) డెలివరీ చేసింది. దీంతో జయ్ షాకయ్యాడు. తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. క్యాన్సిల్ చేసిన ఆర్డర్‌ను డెలివరీ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్‌పై అమెజాన్ కూడా స్పందించింది. అసలేం జరిగిందో తమకు రిపోర్ట్ చేయాలంటూ మెసేజ్ పంపింది. కాగా, జయ్ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``నాకు కూడా అలా వస్తే బాగుండేది``, ``ఆర్డర్ చేసిన వస్తువు రెండేళ్ల తర్వాత డెలివరీ కావడం చూశాం, క్యాన్సిల్ చేసింది కూడా ఇలా రావడం ఆశ్చర్యకరం``, ``ఇది ప్రెస్టేజియస్ కుక్కర్``, ``డెలివరీ బాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఉంటాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదీ.. కదులుతున్న లారీ వెనుక ఊయల కట్టుకుని ఎలా ఊగుతున్నాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి