Share News

Viral Video: ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. గూటిలోని కోకిల పిల్ల వద్దకు వెళ్లిన ఊసరవెళ్లి.. చివరకు..

ABN , Publish Date - Oct 04 , 2024 | 09:13 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ గూటిలో కోకిల పిల్ల ఒంటరిగా ఉండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ ఊసరవెళ్లి కోకిల గూటి వద్దకు వెళ్తుంది. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. సీన్ కట్ చేస్తే..

Viral Video: ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. గూటిలోని కోకిల పిల్ల వద్దకు వెళ్లిన ఊసరవెళ్లి.. చివరకు..

కోకిల అనగానే మనకు అందమైన పాటలు గుర్తుకువస్తాయి. అలాంటి కోకిల క్రూరంగా ప్రవర్తించిందంటే నమశక్యం కాదు. అలాంటిది ఇక కళ్లతో చూస్తే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టిం తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఊసరవెళ్లి కోకిల పిల్ల ఉన్న గూటి వద్దకు వెళ్లింది. చివరకు కోకిల పిల్ల చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ గూటిలో కోకిల పిల్ల ఒంటరిగా ఉండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ ఊసరవెళ్లి కోకిల గూటి వద్దకు వెళ్తుంది. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. సీన్ కట్ చేస్తే.. ఊసరవెళ్లి తల కోకిల పిల్ల నోటిలో ఉంటుంది. అంత పెద్ద ఊసరవెళ్లిని ఇంత చిన్న కోకిల పిల్ల (baby cuckoo swallowing chameleon) మింగే ప్రయత్నం చేస్తుంటుంది.

Viral Video: ఈ ఆటో డ్రైవర్ క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. ముందు వైపు నుంచి చూడగా.. అవాక్కయ్యే సీన్..


అయితే ఊసరవెళ్లి పెద్దగా ఉండడంతో.. దాన్ని మింగేందుకు కోకిల పిల్ల చాలా ఇబ్బంది పడుతుంటుంది. అయినా దాన్ని వదలకుండా పూర్తిగా మింగేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో తల్లి కోకిల అక్కడికి వస్తుంది. వచ్చీ రాగానే తన పిల్ల చేసిన ఘనకార్యం చూసి ఎంతో మురిసిపోతుంది. కాసేపు అలాగే చూస్తుండిపోతుంది. తర్వాత తన పిల్ల ఇబ్బందిని గమనించి, ఊసరవెళ్లిని పూర్తిగా మింగేందుకు సాయం చేస్తుంది. తల్లి సాయంతో అందించడంతో పిల్ల చూస్తుండగానే దాన్ని పూర్తిగా మింగేస్తుందన్నమాట.

Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం.. తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ..


సాధారణంగా కోకిలలు కీటకాలను ఆహారంగా తీసుకుంటుంటాయి. అలాగే గొంగళిపురుగులతో పాటూ గుడ్లు, కోడి పిల్లలను కూడా తింటుంటాయి. అయితే ప్రస్తుతం ఊసరవెళ్లిని తింటున్న కోకిల పిల్ల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ దారుణంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘తల్లి కూడా పిల్లకు సాయం చేస్తోంది’’.. అంటూ మరికొందరు, ‘‘దీన్ని చూస్తుంటే డ్రాగన్‌లా కనపడుతోంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 99వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ సింహాలు సినిమాలు చూసి అప్డేట్ అయ్యాయేమో.. దాడి చేయడంలో ఎలాంటి స్కెచ్ వేశాయో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 04 , 2024 | 09:40 PM