Viral Video: మొసళ్లు ఎంత డేంజరో తెలుసా.. నీళ్లు తాగడానికి వెళ్లిన పందిని ఎలా పట్టుకున్నాయో చూస్తే..
ABN , Publish Date - Dec 11 , 2024 | 09:30 AM
మొసళ్లు చూసేందుకు ఎంత భయంకరంగా కనిపిస్తాయో.. వాటి వేట కూడా అంతే భయానకంగా ఉంటుంది. వాటి సమీపానికి వెళ్లిన జంతువు ప్రాణాలతో తిరిగిరావడం దాదాపు అసాధ్యం. మొసలి వేటకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా..
మొసళ్లు చూసేందుకు ఎంత భయంకరంగా కనిపిస్తాయో.. వాటి వేట కూడా అంతే భయానకంగా ఉంటుంది. వాటి సమీపానికి వెళ్లిన జంతువు ప్రాణాలతో తిరిగిరావడం దాదాపు అసాధ్యం. మొసలి వేటకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీళ్లు తాగడానికి వెళ్లిన పందిని కొన్ని మొసళ్లు ఎంతో చాకచక్యంగా వేటాడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని పందులు దాహం (Pigs went to drink water) తీర్చుకునేందుకు నీళ్ల కొలను వద్దకు వెళ్తాయి. అయితే అప్పటికే ఆ కొలనులో చాలా మొసళ్లు వేట కోసం ఎదురుచూస్తుంటాయి. ఓ పంది ముందుగా నీళ్లు తాగేందుకు కొలను ఒడ్డు నుంచి కాస్త కిందకు దిగుతుంది. అప్పటికే చుట్టుముట్టిన మొసళ్లు.. పందిని లోపలికి లాగేందుకు ఎదురు చూస్తుంటాయి.
Viral Video: ఇది మామూలు ట్రైనింగ్ కాదురా బాబోయ్.. ఆమె ఇలా చెప్పగానే.. పావురం చేసిన పని చూడండి..
వాటిలో ఓ మొసలి నీటిలోంచి ఒక్కసారిగా పైకి లేచి పందిని ఒక్క తోపు తోసేస్తుంది. దీంతో మిగతా మొసళ్లన్నీ (Crocodile attack on pig) పందిని చుట్టుముట్టి దాడి చేస్తాయి. వాటి దాడి నుంచి తప్పించుకోవాలని పంది శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ మొసళ్ల గుంపు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో చివరకు వాటికి ఆహారమవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పంది మొసళ్లు చిక్కడంతో మిగతా పందులు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను దక్కించుకుంటాయి.
Viral Video: వామ్మో.. ఇలాక్కూడా జరుగుతుందా.. మహిళ నడుస్తూ వెళ్తుండగా ఫుట్‌పాత్‌పై పేలుడు.. చివరకు..
ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఈ పందిని చూస్తుంటే బాధగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. మొసళ్ల వేట చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. ఈ హిప్పో బెదిరింపు మామూలుగా లేదుగా.. వాహనాన్ని వెంబడించి మరీ.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..