Share News

Viral Video: డీజిల్‌తో పరాటా చేయడం చూశారా? వైరల్ వీడియోపై రెస్టారెంట్ ఓనర్ రియాక్షన్ ఏంటంటే..

ABN , Publish Date - May 16 , 2024 | 12:38 PM

చాలా రుచిగా ఉండే పరోటాలను చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఆలూ పరాటాలను చాలా మంది ఇష్టంగా తింటారు. సాధారణంగా పరాటాలను నూనె లేదా నెయ్యితో వేయిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో పరాటాను డిజీల్‌తో వేయించారు. పెనం మీద పరాటా వేసి దానిపై నిండా డీజిల్ వేశారు.

Viral Video: డీజిల్‌తో పరాటా చేయడం చూశారా? వైరల్ వీడియోపై రెస్టారెంట్ ఓనర్ రియాక్షన్ ఏంటంటే..
Diesel Paratha

చాలా రుచిగా ఉండే పరాటాలను (Parathas) చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఆలూ పరాటాలను చాలా మంది ఇష్టంగా తింటారు. సాధారణంగా పరాటాలను నూనె (Oil) లేదా నెయ్యితో వేయిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో పరాటాను డీజిల్‌తో (Diesel Paratha) వేయించారు. పెనం మీద పరాటా వేసి దానిపై నిండా డీజిల్ వేశారు. ఆ డీజిల్‌లో ఆ పరాటాను వేయించారు. చండీగఢ్ (Chandigarh)లోని ఓ చిన్నపాటి ధాబాలో ఈ వీడియోను రికార్డు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ఆలూ పరాటను వత్తి దానిని పెనంపై వేసి రెండు వైపులా కాల్చాడు. అనంతరం దానిపై ఓ డబ్బాలో ఉన్న ఆయిల్ వేశాడు. అదేంటి అని అడిగితే.. ``డీజిల్`` అని చెప్పాడు. ఇక ఆ పెనం నిండుగా డీజిల్‌ నింపాడు. అందులోనే ఆలూ పరాటాను బాగా కాల్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకయ్యారు. డీజిల్‌తో పరాటా ఏంటి అంటూ అందరూ విమర్శలు గుప్పించారు. ఆ ధాబా ఓనర్‌ను ట్రోలింగ్ చేశారు.


విమర్శలు ఎక్కువవుతుండడంతో ఆ ధాబా ఓనర్ ఛన్నీ సింగ్ స్పందించాడు. ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చాడు. తాము డీజిల్ పరాటాలాంటిది ఏదీ తయారు చేయలేదని స్పష్టం చేశాడు. ``మేం అలాంటి డీజిల్ పరాటాను తయారు చేసి అమ్మలేదు. ఓ ఫుడ్ బ్లాగర్ సరదాగా ఆ వీడియోను రూపొందించాడు. మేం చాలా శుభ్రంగా, ఆరోగ్యకర ఆహారాన్ని మాత్రమే తయారు చేసి విక్రయిస్తామ``ని స్పష్టం చేశాడు. ఇక, ఆ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్లాగర్ అమన్ ప్రీత్ సింగ్ క్షమాపణలు తెలిపాడు.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: ముంబై టీమ్‌లో రెండు వర్గాలు.. భారత ఆటగాళ్లు రోహిత్ వైపు.. ఫారిన్ ప్లేయర్లు హార్దిక్ వైపు..?


Viral Video: హే ప్రభూ.. ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఇలాంటి ఆలోచనలు.. దోమల బ్యాట్‌తో ఏం చేస్తోందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 16 , 2024 | 12:38 PM