Share News

Viral Video: హే ప్రభూ.. ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఇలాంటి ఆలోచనలు.. దోమల బ్యాట్‌తో ఏం చేస్తోందో చూడండి..

ABN , Publish Date - May 16 , 2024 | 11:14 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటుంటే, మరికొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. మరికొందరు వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో ఫన్నీ ప్రయోగాలు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Viral Video: హే ప్రభూ.. ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఇలాంటి ఆలోచనలు.. దోమల బ్యాట్‌తో ఏం చేస్తోందో చూడండి..
Toasts Bread On Mosquito bat

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటుంటే, మరికొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. మరికొందరు వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో ఫన్నీ ప్రయోగాలు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐరన్ బాక్స్‌పై ఆమ్లెట్ వేయడం, ఎండ వేడిలో పెనం పెట్టి దోసెలు వేయటం వంటివి చూసి ఉంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే నవ్వు రాక మానదు (Viral Video).


tulika_world_official అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ దోమలను చంపే బ్యాట్‌ను (Mosquito bat) ఉపయోగించి బ్రెడ్ (Bread) ముక్కలను కాల్చుతోంది. ఆమె మంచం మీద కూర్చుని దోమల బ్యాట్ పట్టుకుని దానిపై బ్రెడ్ ముక్కలను ఉంచింది. వాటిని బాగా కాల్చిన తర్వాత రుచి కూడా చూసింది. ``.బ్రెడ్ టోస్ట్ చేయడానికి ఇది కొత్త టెక్నిక్`` అని ఆ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Toasts Bread On Mosquito bat).


ఈ వైరల్ వీడియోకు లక్షల్లో వ్యూస్ లభించాయి. దాదాపు 10 వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బ్రెడ్ విత్ మస్కిటో శాండ్‌విచ్ ``, ``దోమల టేస్ట్ కూడా రుచి చూడవచ్చు``, ``దయచేసి ఇలా చేయకండి``, ``ఇది కేవలం వ్యూస్, లైక్స్ కోసమే రూపొందించిన వీడియో``, ``వెరీ ఫన్నీ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుంది.. కార్ వెనుక స్టంట్ చేయడానికి ప్రయత్నించి ఎలా బోల్తా పడ్డాడో చూడండి..


Opitcal Illusion: మీ మెదడుకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న నాలుగు ఆంగ్ల పదాలను 15 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 16 , 2024 | 11:14 AM