Share News

Viral video: మీకు మామిడి పళ్లు అంటే ఇష్టమా? అయితే ఇకపై తినే ముందు ఈ టిప్స్ తప్పక పాటించండి..!

ABN , Publish Date - May 21 , 2024 | 04:34 PM

వేసవి వచ్చిందంటే నోరూరించే మామిడి పళ్లు మార్కెట్లలోకి వస్తాయి. ఎన్నో రకాల మామిడి పళ్లు పసుపు రంగులో మెరుస్తుంటాయి. మామిడి పళ్లను తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే మామిడి పళ్లు తినే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది.

Viral video: మీకు మామిడి పళ్లు అంటే ఇష్టమా? అయితే ఇకపై తినే ముందు ఈ టిప్స్ తప్పక పాటించండి..!
Tips to clean Mangoes

వేసవి వచ్చిందంటే నోరూరించే మామిడి పళ్లు (Mangoes) మార్కెట్లలోకి వస్తాయి. ఎన్నో రకాల మామిడి పళ్లు పసుపు రంగులో మెరుస్తుంటాయి. మామిడి పళ్లను తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే మామిడి పళ్లు తినే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ప్రస్తుతం అన్నింటికీ క్రిమి సంహారక మందులు, కృత్రిమ ఎరువులు ఉపయోగిస్తున్నారు. అలాగే కృత్రిమ రసాయనాలతో పళ్లు పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. మరికొన్ని పళ్లలో పురుగులు (worms) ఉంటున్నాయి (Viral Video).


అలాంటి మామిడి పళ్లను తింటే జీర్ణ సంబంధ సమస్యలు, డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో urvashiagarwal1 అనే మహిళ మామిడి పళ్లను తీనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. మామిడి పండు లేదా ఏ ఇతర ఫలమైనా తినే ముందు 4-5 గంటల పాటు కచ్చితంగా ఉప్పు నీటిలో నానబెట్టాల్సిందేనని ఆమె చెప్పింది. అలా చేయడం వల్ల పండులో ఉండే పురుగులు బయటకు రావడమే కాకుండా అందులో ఉండే రసాయనాలు, క్రిమ సంహారకాలు కూడా బయటకు వచ్చేస్తాయట (Tips to clean Mangoes).


అలా నానబెట్టడం వల్ల మామిడి పండు మరింత రుచిగా, నాణ్యంగా మారుతుందట. అలా నానబెట్టిన పండును తొక్కతో తిన్నా ఇబ్బంది ఉండదట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్‌కు పైగా వ్యూస్ దక్కించుకుంది. 37 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఎంతో ఉపయోగకరమైన టిప్స్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

Viral News: సెక్స్ వర్కర్ దారుణం.. హెచ్‌ఐవీ సోకిన విషయం దాచి 200 మందితో శృంగారం.. చివరకు..


Opitcal Illusion: మీ కళ్లు పవర్‌ఫుల్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలోని మూడు గుడ్లగూబలను 8 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2024 | 04:34 PM