Viral Video: స్కూటీని రివర్స్‌లో నడుపుతున్నాడేమో అనుకున్నారు.. తీరా దగ్గరికి వెళ్లి చూసి ఖంగుతిన్నారు..
ABN , Publish Date - Dec 05 , 2024 | 04:44 PM
కొందరు బైకు, స్కూటీలను విచిత్రంగా నడుపుతూ అందరి దృష్టినీ ఆకర్షించడం చూస్తుంటాం. కానీ ఈ వ్యక్తి మాత్రం ఎవరూ చేయని విధంగా సరికొత్త ప్రయోగం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఆ వ్యక్తి తన స్కూటీని అందరిలా కాకుండా వినూత్నంగా నడపాలని అనుకున్నాడు. ఇందుకోసం..
కొందరు వాహనాలను నడిపే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. పాత విడి భాగాలతో కొత్త కొత్త వాహనాలను తయారు చేసే వారు కొందరైతే.. ఇంకొందరు వాహనాల రూపు రేఖలు మార్చి తమకు నచ్చిన విధంగా మార్చుకుంటుంటారు. బైకును ఆటోగా మార్చిన వారిని చూశాం.. అదే బైక్‌కు రెండు వైపులా నలుగురిని కూర్చోబెట్టుకుని వెళ్లిన వారిని కూడా చూశాం. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని చూసి అంతా రివర్స్‌లో నడుపుతున్నాడేమో అనుకున్నారు. తీరా దగ్గరికి వెళ్లి చూసి ఖంగుతిన్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు బైకు, స్కూటీలను (Bike, scooty) విచిత్రంగా నడుపుతూ అందరి దృష్టినీ ఆకర్షించడం చూస్తుంటాం. కానీ ఈ వ్యక్తి మాత్రం ఎవరూ చేయని విధంగా సరికొత్త ప్రయోగం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఆ వ్యక్తి తన స్కూటీని అందరిలా కాకుండా వినూత్నంగా నడపాలని అనుకున్నాడు. ఇందుకోసం ఎవరూ ఆలోచించని విధంగా స్కూటీ వెనుక టైరును ముందు టైరులా మార్చేశాడు.
Viral Video: సామాన్లు తరలించడం ఇంత ఈజీనా.. ఇతడి ట్రిక్ మామూలుగా లేదుగా..
ఇందుకోసం సీటు వెనుక భాగంలో పెద్ద రంధ్రం చేసి, అందులో నుంచి వెనుక టైరుకు హ్యాండిల్‌ను అనుసంధానం చేశాడు. తద్వరా బ్యాక్ టైరును అటూ, ఇటూ కదిలేలా ఫిట్ చేశాడు. చివరగా స్కూటీపై వెనక్కు తిరిగి కూర్చుని, ఎంచక్కా హ్యాండిల్ పట్టుకుని డ్రైవ్ చేసేశాడు. అలాగే తలపై హెల్మెట్‌కు బదులుగా రైస్ కుక్కర్‌ను బోర్లించుకున్నాడు. అతను వెళ్లే విధానం చూస్తే.. స్కూటీని రివర్స్‌లో నడుపుతున్నట్లు అనిపిస్తోంది.
Viral Video: ఈ తాతా మరీ అమాయకత్వంగా ఉన్నాడే.. ఫోన్‌ను ఎలా శుభ్రం చేస్తున్నాడో చూస్తే అవాక్కవుతారు..
ఇతడి డ్రైవింగ్ చూసి షాకైన వారంతా దగ్గరికి వెళ్లి అతడి అతి తెలివి చూసి అవాక్కవుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘స్కూటీని ఇలాక్కూడా నడపొచ్చని ఇప్పుడే తెలిసింది’’.., ‘‘మార్కెట్లోకి కొత్త స్కూటీ వచ్చిందోచ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..