Share News

Viral Video: నిధి కోసం వెతుకుతుండగా.. మోగిన మెటల్ డిటెక్టర్.. చివరకు..

ABN , Publish Date - Aug 02 , 2024 | 08:46 AM

నిధుల కోసం అక్రమ తవ్వకాలు చేపట్టడం నేరమని తెలిసినా చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. బంగారు కోసం తవ్వకాలు చేస్తే.. ఏవేవో వింత వింత వస్తువులు కనిపిస్తుంటాయి. ఇలాంటి ..

Viral Video: నిధి కోసం వెతుకుతుండగా.. మోగిన మెటల్ డిటెక్టర్.. చివరకు..

నిధుల కోసం అక్రమ తవ్వకాలు చేపట్టడం నేరమని తెలిసినా చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. బంగారు కోసం తవ్వకాలు చేస్తే.. ఏవేవో వింత వింత వస్తువులు కనిపిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నిధి కోసం వెతుకుతుండగా.. ఉన్నట్టుండి మెటల్ డిటెక్టర్ సౌండ్ వినిపించింది. దీంతో ఏముందా అని తవ్వి చూడగా.. లోపల షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మెటల్ డిటెక్టర్ (Metal detector) చేతిలో పట్టుకుని నిధి (treasure) కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలో అతను మట్టిలో వెతుకుతుండగా.. ఉన్నట్టుండి ఓ ప్రదేశంలో మెటల్ డిటెక్టర్ అలారం మోగుతుంది. దీంతో అక్కడ ఏముందా అని.. అతను తవ్వేందుకు ప్రయత్నిస్తాడు. రాళ్లు, మట్టి తొలగిస్తూ వెళ్తాడు.

Viral Video: పామును పేపర్లలో చుట్టేసి నిప్పు పెట్టిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూడండి..


చివరకు అతడికి లోపల ఓ మట్టి కూజా కనిపిస్తుంది. దాన్ని బయటికి తీసి, చూడగా లోపల బంగారు వర్ణంలో మరో కూజా (golden jar) లాంటి పాత్ర కనిపిస్తుంది. మట్టి కూజాను పగులగొట్టి చూడగా.. లోపల బంగారు కూజాతో పాటూ కొన్ని నాణేలు, ఆభరణాలు కూడా కనిపిస్తాయి. అయితే ఇదంతా గమనిస్తే.. వ్యూస్, లైక్‌ల కోసమే ఇలా చేసినట్లు అనిపిస్తుంది. ముందే మట్టి కూజాను భూమిలో పాతిపెట్టి, తర్వాత నిధి దొరికినట్లుగా చూపిస్తూ తవ్వాడని అర్థమవుతుంది.

Viral Video: ఇలాంటి వాడిని ఏం చేయాలి.. రైల్వే ట్రాక్స్‌పై ఇతను చేస్తున్న నిర్వాకం చూడండి..


ఏదిఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదంతా ఫేక్.. వ్యూస్, లైక్‌ల కోసం కావాలనే ఇలా చేశారు’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అన్నీ ఇలాంటి ఫేక్ వీడియోలనే షేర్ చేస్తుంటారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: యువతి పక్కనే నిలబడి.. ఆమెకు తెలీకుండానే.. ఈ వృద్ధుడు చేసిన నిర్వాకం చూడండి..

Updated Date - Aug 02 , 2024 | 09:14 AM