Share News

Zomato: ముంబై జొమాటో డెలివరీ బాయ్ రూ.500 రూమ్ చూశారా? తెగ వైరల్ అవుతోంది..

ABN , Publish Date - Jul 25 , 2024 | 08:05 AM

పెద్ద పెద్ద లగ్జరీ ఇళ్లను చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి? హోమ్ టూర్ వీడియో ఎవరైనా పెడితే నెట్టింట జనాలు తెగ ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే హోమ్ టూర్ పెట్టే వాళ్లంతా కూడా తమ ఇల్లు అందంగా లగ్జరీ గా ఉంటేనే పెడుతుంటారు.

Zomato: ముంబై జొమాటో డెలివరీ బాయ్ రూ.500 రూమ్ చూశారా? తెగ వైరల్ అవుతోంది..

ముంబై: పెద్ద పెద్ద లగ్జరీ ఇళ్లను చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి? హోమ్ టూర్ వీడియో ఎవరైనా పెడితే నెట్టింట జనాలు తెగ ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే హోమ్ టూర్ పెట్టే వాళ్లంతా కూడా తమ ఇల్లు అందంగా లగ్జరీ గా ఉంటేనే పెడుతుంటారు. నెటిజన్లు కూడా అలాంటి ఇళ్లనే చూడటానికి ఇష్టపడతారు. అయితే ఇదంతా మొన్నీ మధ్య వరకూ.. ప్రస్తుతం సీన్ మారింది. దీనికి నిదర్శనమే ఓ జొమాటో బాయ్ పెట్టిన రూమ్ టూర్. ముంబైలో జొమాటో బాయ్‌గా పని చేస్తున్న ప్రంజయ్ బోర్గోయరీ అక్కడి మురికివాడలో జీవిస్తున్నాడు. అతను తన రూమ్ టూర్ చేసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అది నెట్టింట దుమ్ము రేపుతోంది. దాదాపు 5 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళుతోంది. బోర్గోయరీ ఈశాన్య భారత దేశం నుంచి వలస వచ్చి ముంబైలోని మురికి వాడలో జీవిస్తున్నాడు. అతని గది అద్దెంతో తెలుసా? కేవలం రూ.500. ఇంత తక్కువ మొత్తంలో రూమ్ ఎలా ఉంటుందో చూస్తే గుండె తరుక్కుపోతుంది. అంత ఇరుకు జీవితంలోనూ అతను ఒక పిల్లిని పెంచుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.


ప్రంజయ్ బోర్గోయరీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతని వీడియోను చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఖుషీ అనే ఒక నెటిజన్ అయితే బోర్గోయరీ వీడియోను చూసి చలించి పోయి అతని మూడు నెలల రూం అద్దెను చెల్లించాడు. ప్రతి ఒక్కరూ అతని కష్టం.. జీవన పరిస్థితులను చూసి బరువెక్కిన మనసుతో కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో మరో విషయం కూడా హైలైట్ అవుతోంది. ప్రంజయ్ బోర్గోయరీ మాత్రమే కాదు.. దేశంలో మెజారిటీ ప్రజానీకం ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోనే జీవిస్తోంది. ఇప్పుడు హైలైట్ అవుతున్న విషయం ఏంటంటే.. ముంబైలోని అధిక జీవన వ్యయం. చాలా మంది ముంబైలో లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. బోర్గోయరీ చేస్తున్న జీవన పోరాటం ఆయన ఒక్కరు చేస్తున్నదే కాదు.. ఆయన లాంటి చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యే. వీరంతా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నవారు. ఇరుకైన చిన్న గదిలో జీవిస్తూ కుటుంబ అవసరాలను తీర్చడం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు.


ఇక బోర్గోయరీ విషయానికి వస్తే.. అతనొక మంచి ఫుట్‌బాల్ క్రీడాకారుడు.. అంతకు మించి అద్భుతమైన గాయకుడు. ఆన్‌లైన్ ద్వారా తన సంగీత పరిజ్ఞానాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్‌లతో పంచుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా తన సంకల్పం ఏంటనేది.. కలలు ఏంటి? వంటి వియాలన్నింటినీ నెటిజన్లతో బోర్గోయరీ పంచుకుంటూ ఉంటాడు. నెటిజన్లు బోర్గోయరీకి పెద్ద ఎత్తున సపోర్టు ఇస్తున్నారు. బోర్గోయరీ చూడటానికి కూడా మంచి ఫిజిక్‌తో హీరోలా ఉండటంతో తాజాగా మోడలింగ్ చేసేందుకు ప్రయత్నించాలంటూ పలువురు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మంచి కూడా జరుగుతుందనడానికి బోర్గోయరీ కథే నిదర్శనం. అతని ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున మద్దతు, ప్రోత్సాహం లభిస్తోంది.

Updated Date - Jul 25 , 2024 | 08:05 AM