Share News

Viral Video: ఈ డస్ట్ బిన్‌ను చూస్తే చెత్త వేయకుండా ఉండలేరు.. దీన్నెలా తయారు చేశారో చూస్తే..

ABN , Publish Date - Dec 17 , 2024 | 07:54 AM

టెక్నాలజీ రంగం రోజురోజుకూ కొంత పుంతలు తొక్కుతోంది. కాలు కదపకుండా ఇంట్లో కూర్చునే ఒక్క క్లిక్‌తో అన్ని పనులనూ చేసుకునే వెలుసుబాటు వచ్చేసింది. ఈ క్రమంలో కొన్ని ఆవిష్కరణలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ..

Viral Video: ఈ డస్ట్ బిన్‌ను చూస్తే చెత్త వేయకుండా ఉండలేరు.. దీన్నెలా తయారు చేశారో చూస్తే..

టెక్నాలజీ రంగం రోజురోజుకూ కొంత పుంతలు తొక్కుతోంది. కాలు కదపకుండా ఇంట్లో కూర్చునే ఒక్క క్లిక్‌తో అన్ని పనులనూ చేసుకునే వెలుసుబాటు వచ్చేసింది. ఈ క్రమంలో కొన్ని ఆవిష్కరణలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై వినూత్నంగా ఉన్న డస్ట్ బిన్‌ను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ డస్ట్ బిన్‌ను చూస్తే చెత్త వేయకుండా ఉండలేరు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హాంకాంగ్‌లో (Hong Kong) తయారు చేసిన డస్ట్‌బిన్.. ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రోడ్డుపై ఏదో ఒక మూల ఉండాల్సిన డస్ట్‌బిన్ (dustbin moving on road) కాస్తా.. అటూ, ఇటూ తిరుగుతోంది. అంతటితో ఆగకుండా చెత్త వేయమంటూ వేడుకుంటోంది. ఎవరూ పట్టించుకోకపోతే ఏడ్చి మరీ తర బాధను వ్యక్తం చేస్తుంది.

Viral Video: ఈ పోలీసు అతి తెలివి మామూలుగా లేదుగా.. చలికి తట్టుకోలేక ఖైదీతో..


ఈ వింత డస్ట్‌బిన్‌ను చూసి రోడ్డుపై వెళ్లే వారంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏడుస్తున్న ఆ డస్ట్‌బిన్.. ఎవరైనా అందులో చెత్త వేయగానే సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యావాదాలు కూడా తెలియజేస్తుంది. దీంతో ఈ డస్ట్‌బిన్‌ను చూసి వారంతా తమ వద్ద ఉన్న వ్యర్థాలను అందులో పడేస్తున్నారు. ఇలా ఎక్కడపడితే అక్కడ ఎత్త వేసే వారిని నిరంతరం అప్రమత్తం చేస్తున్న ఈ వినూత్న డస్ట్‌బిన్ అందరినీ తెగ ఆకట్టుకుటోంది.

Viral Video: సింహాన్ని చుట్టేసిన కొండచిలువ.. చివరికి ఏమైందో చూస్తే కళ్లు తేలేస్తారు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నైస్ ఐడియా.. ఈ డస్ట్‌బిన్ ఎంతో బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇండియాలో ఇలాంటి టెక్నాలజీ రావాంటే.. ఇంకో 50 ఏళ్లు పడుతుందేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 2.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వధువుకు స్వీట్ తినిపించాలని చూసిన వరుడు.. చివరకు ఆమె రియాక్షన్ చూసి అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 17 , 2024 | 08:24 AM