Share News

Viral News: భార్య అఫైర్.. అడ్డంగా బుక్కైన భర్త.. ట్విస్ట్ అదిరిపోయింది..!

ABN , Publish Date - Aug 25 , 2024 | 08:41 AM

Wife and Husband: ఆమెకు, అతనికి పెళ్లైంది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమెకు మరో వ్యక్తితో అఫైర్ ఉంది. ఇదే విషయంలో ఆమె భర్తకు అనుమానం మొదలైంది. తన భార్యను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందామని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్‌ను అమలు చేశాడు. భార్య మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా..

Viral News: భార్య అఫైర్.. అడ్డంగా బుక్కైన భర్త.. ట్విస్ట్ అదిరిపోయింది..!
Wife and Husband

Wife and Husband: ఆమెకు, అతనికి పెళ్లైంది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమెకు మరో వ్యక్తితో అఫైర్ ఉంది. ఇదే విషయంలో ఆమె భర్తకు అనుమానం మొదలైంది. తన భార్యను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందామని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్‌ను అమలు చేశాడు. భార్య మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఆధారాలను చూపి విడాకులు కోరుతూ కోర్టుకెక్కాడు భర్త. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య అడ్డంగా దొరికిపోయినప్పటికీ.. భర్తకే శిక్ష పడింది. సదరు భర్తకు మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడిదే సంచలనంగా మారింది. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది? కోర్టు అతన్నెందుకు శిక్షించింది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి..


ఈ ఘటన తైవాన్‌లో చోటు చేసుకుంది. ఫాన్ వ్యక్తికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే, అతని భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని అనుమానించాడు. ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఇంట్లోని గదుల్లో, పడకగదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. అతని అనుమానం నిజమైంది. తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. తన భార్య, ఆమె ప్రియుడి ఏకాంత క్షణాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వీటిని ఆధారంగా చూపుతూ ఫాన్.. కోర్టును ఆశ్రయించాడు. తన భార్య తనను మోసం చేసి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని.. విడాకులు ఇప్పించాలని కోరాడు. అయితే, తొలుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నించారు. భార్య అంగీకరించకపోవడంతో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు ఫాన్.


కోర్టులో సీన్ రివర్స్..

విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన ఫాన్‌కు బిగ్ షాక్ ఇచ్చింది న్యాయస్థానం. రివర్స్‌గా అతనికే 3 నెలల జైలు శిక్ష విధించింది. తన భర్త తన ప్రైవసీ భంగం కలిగించే చర్యలకు పాల్పడ్డాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, తన భార్య తనను మోసం చేస్తుందని.. అందుకే గదిలో సీసీ కెమెరాను అమర్చానని చెప్పుకొచ్చాడు ఫాన్. కానీ, ధర్మాసనం ఇతని మాటలను పట్టించుకోలేదు. మహిళ ప్రైవసీకి భంగం కలిగించాడనే కారణంతో ఫాన్‌కు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పే ఇప్పుడు సంచలనంగా మారింది.


ఈ వార్త సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతోంది. తప్పు చేసింది భార్య అయితే.. భర్తను ఎందుకు జైలుకు పంపారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. తప్పు చేసిన భార్య హ్యాపీగా ఉండగా.. ఏ తప్పూ చేయని భర్త దోషి అయ్యాడని సానుభూతి ప్రకటిస్తున్నాడు. మొత్తంగా భార్యను పట్టించబోయి భర్త ఇరుక్కోవడం సంచలనంగా మారింది.

For More Trending News and Telugu News..

Updated Date - Aug 25 , 2024 | 08:41 AM