Share News

Viral Video: కండక్టర్ కాదు.. స్పైడర్‌మ్యాన్.. ప్రయాణికుడ్ని ఎలా కాపాడాడో చూడండి

ABN , Publish Date - Jun 07 , 2024 | 03:29 PM

‘స్పైడర్‌మ్యాన్’ సినిమాల్లో.. ప్రమాదంలో ఉన్న ప్రజలను హీరో ఎలా కాపాడుతాడో అందరూ చూసే ఉంటారు. ఎక్కడి నుంచో ఊడిపడి.. రెప్పపాటులో చనిపోబోయే వ్యక్తుల్ని రక్షిస్తాడు.

Viral Video: కండక్టర్ కాదు.. స్పైడర్‌మ్యాన్.. ప్రయాణికుడ్ని ఎలా కాపాడాడో చూడండి
Kerala Bus Conductor Saves Passenger

‘స్పైడర్‌మ్యాన్’ (Spiderman) సినిమాల్లో.. ప్రమాదంలో ఉన్న ప్రజలను హీరో ఎలా కాపాడుతాడో అందరూ చూసే ఉంటారు. ఎక్కడి నుంచో ఊడిపడి.. రెప్పపాటులో చనిపోబోయే వ్యక్తుల్ని రక్షిస్తాడు. ఇప్పుడు ఓ కండక్టర్ (Bus Conductor) కూడా అలాగే ఓ ప్రయాణికుడిని కాపాడాడు. పట్టు తప్పి కింద పడిపోబోతున్న ఆ ప్యాసింజర్‌ని ఒంటిచేత్తో రక్షించి.. దేశీ స్పైడర్‌మ్యాన్‌గా ప్రశంసలు పొందుతున్నాడు. ఈ ఘటన కేరళలో (Kerala) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


కేరళలోని ఓ యువకుడు అప్పుడే బస్సు ఎక్కాడు. డోర్ పక్కనే ఉన్న సీటుకి ఆనుకొని.. కండక్టర్ ఓ ప్యాసింజర్‌కి టికెట్ కొడుతున్నాడు. బస్సెక్కిన ఆ యువకుడు సైతం టికెట్ ఇవ్వమని కండక్టర్‌ని అడిగాడు. ఇంతలో డ్రైవర్ బస్సుని కుడివైపుకి తిప్పగా.. ఆ అబ్బాయి పట్టు తప్పి కింద పడబోయాడు. ఆ సమయంలో కండక్టర్ ఏమాత్రం కంగారు పడకుండా.. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, ఒంటి చేత్తో అతడిని పట్టుకొని పైకి లాగాడు. దీంతో.. తాను ప్రాణాలతో బయటపడటంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. కండక్టర్ అతనివైపు చూడకుండానే చెయ్యి అందించి, సూపర్ హీరోలా కాపాడటం!


ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లో హీరోలా తరహాలో కండక్టర్ ఆ యువకుడిని కాపాడటంతో.. అందరూ ఆయన్ను కొనియాడుతున్నారు. స్పైడర్‌మ్యాన్ తరహాలోనే ఆ అబ్బాయిని కండక్టర్ కాపాడాడంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సాధారణంగా మనుషులకు ఐదు ‘సెన్సెస్’ ఉంటాయని.. కానీ ఈ కండక్టర్ తన 25వ సెన్స్‌తో ఆ ప్రయాణికుడ్ని బస్సు నుంచి కింద పడిపోకుండా కాపాడాడని నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 03:39 PM