Share News

Optical illusion: ఈ చిత్రంలో మొత్తం 10 మొఖాలు ఉన్నాయి.. కనుక్కోగలరేమో ట్రై చేయండి...

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:06 PM

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోల్లో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలోని ఫజిల్స్‌ను పరిష్కరించడం కొన్నిసార్లు కష్టంగా మారితే మరికొన్నిసార్లు కాస్త తెలివిగా ఆలోచిస్తే.. ఈజీగా పరిష్కరించే విధంగా ఉంటాయి. ఇలాంటి..

Optical illusion: ఈ చిత్రంలో మొత్తం 10 మొఖాలు ఉన్నాయి.. కనుక్కోగలరేమో ట్రై చేయండి...

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోల్లో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలోని ఫజిల్స్‌ను పరిష్కరించడం కొన్నిసార్లు కష్టంగా మారితే మరికొన్నిసార్లు కాస్త తెలివిగా ఆలోచిస్తే.. ఈజీగా పరిష్కరించే విధంగా ఉంటాయి. ఇలాంటి ఫజిల్స్‪‌ను పరిష్కరించడంపై కొందరు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వారి కోసం నెట్టింట అనేక రకాల ఫొటోలు, వీడియోలు అందుబాటులో ఉంటాయి. అలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఇక్కడ కనిపిస్తున్న బెంజమిన్ ఫ్రాంక్లిన్ చిత్రంలో మొత్తం పది మొఖాలు దాగి ఉన్నాయి. అవేంటో గుర్తుపట్టడానికి ట్రై చేయండి మరి..

ఈ చిత్రాన్ని డులుత్ హెరాల్డ్ అనే పత్రిక 1914లో ప్రచురించింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో పైకి మాత్రం బెంజమిన్ ఫ్రాంక్లిన్ మొఖం కనుపడుతుంది. అయితే ఇందులోనే మొత్తం 10 మొఖాలు కూడా దాక్కుని ఉంటాయి. కాస్త నిశితంగా పరిశిస్తే.. వాటిని గుర్తు పట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగని అంత సులభం కూడా కాదు. కాస్త మీ దృష్టిని దీనిపైనే కేంద్రీకరించి చూస్తే తప్ప వాటిని గుర్తుపట్టడం సాధ్యం కాదు. మీ టైం స్టార్ట్ అయింది.. గుర్తు పట్టేందుకు ట్రై చేయండి. ఒక వేళ మీకు కష్టంగా ఉంటే మాత్రం ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి ఆ పది మొఖాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-phot.jpg

Updated Date - Feb 06 , 2024 | 09:12 PM