Share News

Viral Video: బాబోయ్.. ఇతను సాధారణ మనిషి కాదు.. పామును పట్టుకుని ఎలా కొరికేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - May 17 , 2024 | 10:52 AM

పాము చాలా విషపూరితమైన జీవి. పాము కాటుకు గురైతే ప్రాణాలను రక్షించుకోవడం చాలా కష్టం. అందుకే ఈ ప్రపంచంలో చాలా మంది పాములంటేనే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడతుంటారు. అయితే కొందరు మాత్రం పాములతో ఆడుకుంటారు.

Viral Video: బాబోయ్.. ఇతను సాధారణ మనిషి కాదు.. పామును పట్టుకుని ఎలా కొరికేస్తున్నాడో చూడండి..
Man bites snake

పాము (Snake) చాలా విషపూరితమైన జీవి. పాము కాటుకు గురైతే ప్రాణాలను రక్షించుకోవడం చాలా కష్టం. అందుకే ఈ ప్రపంచంలో చాలా మంది పాములంటేనే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడతుంటారు. అయితే కొందరు మాత్రం పాములతో ఆడుకుంటారు. ఏమాత్రం భయపడకుండా పాములను పట్టుకుంటారు. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Snake Video) చూస్తే షాక్ అవకుండా ఉండలేం. ఆ వీడియోలోని ఓ వ్యక్తి చర్యను చూస్తే అతడు మనిషో, ముంగిసో అర్థం కాదు (Viral Video).


shivasettu1992 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి పొలంలో బురదలో నిల్చుని ఉన్నాడు. అంతలో అతడికి ఒక పాము కనిపించింది. పాము కనిపిస్తే వెంటనే ఎవరైనా బయటకు వెళ్లిపోతారు. కానీ, అతడు మాత్రం దానిని రెండు చేతులతో పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాకుండా.. ఆ పామును తన నోట్లో పెట్టుకుని పళ్లతో కొరికాడు. అనంతరం ఆ పామును బయటకు విసిరేసి తన పని తాను కొనసాగించాడు. అదేం పెద్ద విషయం కానట్టు ప్రవర్తించాడు (Man bites snake).


ఆ ఘటనను అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.2 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2.2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అన్నయ్యా.. నువ్వు మనిషివా? ముంగిసవా?``, ``బేర్ గ్రిల్స్ ఆఫ్ ఇండియా``, ```ఈ మనిషి పామునే కాటేశాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ బ్రెయిన్‌కు పదును పెట్టండి.. ఈ ఫొటోలోని మూడు తప్పులను 15 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: డీజిల్‌తో పరాటా చేయడం చూశారా? వైరల్ వీడియోపై రెస్టారెంట్ ఓనర్ రియాక్షన్ ఏంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 17 , 2024 | 10:52 AM