Share News

Viral Video: పగిలిపోయిన లారీ లైటుకు అదిరిపోయే రీప్లేస్‌మెంట్.. ఎలా వస్తాయయ్యా! ఇలాంటి ఐడియాలు..

ABN , Publish Date - Jan 23 , 2024 | 09:19 PM

కొందరికి ఎవరికీ రాని ఐడియాలు వస్తుంటాయి. వీరి తెలివితేటలు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. పెద్ద పెద్ద సమస్యలకు సైతం చిన్న చిన్న పనులతో పరిష్కారం చూపిస్తుంటారు. పక్కన పడేసిన...

Viral Video: పగిలిపోయిన లారీ లైటుకు అదిరిపోయే రీప్లేస్‌మెంట్.. ఎలా వస్తాయయ్యా! ఇలాంటి ఐడియాలు..

కొందరికి ఎవరికీ రాని ఐడియాలు వస్తుంటాయి. వీరి తెలివితేటలు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. పెద్ద పెద్ద సమస్యలకు సైతం చిన్న చిన్న పనులతో పరిష్కారం చూపిస్తుంటారు. పక్కన పడేసిన వస్తువులను సైతం తిరిగి వినియోగించి తమ టాలెంట్ చూపిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. ఓ వ్యక్తి పగిలిపోయిన లారీ లైటును సులభంగా రిపేర్ చేసేశాడు. ఇందుకోసం అతడు ఉపయోగించిన వస్తువు చూసి అంతా షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ లారీకి ముందు వైపు ఉన్న హెడ్ లైట్లలో ఒక దాని గ్లాసు పగిలిపోయింది. ఇలాంటి సమయాల్లో సాధారణంగా ఎవరైనా కొత్త అద్దాన్ని అమర్చుకుంటారు. అయితే ఈ లారీ యజమాని మాత్రం అలా చేయలేదు. ఈ మాత్రం దానికి ఖర్చు చేసి కొత్త అద్దం ఎందుకు అనుకున్నాడో ఏమో గానీ.. రూపాయి ఖర్చు లేకుండా కొత్త అద్దాన్ని ఏర్పాటు చేశాడు. పక్కన పడేసిన స్వీట్ బాక్స్ డబ్బా ప్లాస్టిక్ మూత చూడగానే ఇతడికి వెంటనే బల్బ్ వెలిగింది. దీన్నెందుకు లైటుకు అమర్చకూడదు అనుకున్నాడు.

New couple video: పర్యాటకులకు షాక్ ఇచ్చిన కొత్త జంట.. ఫొటోల పేరుతో మరీ దారుణంగా..

అనుకున్నదే తడవుగా వెంటనే ఆ మూతను తీసుకుని లారీ లైటుకు అమర్చాడు. అది కూడా లైటు సైజుకు సరిగ్గా సరిపోయింది. అలాగే పక్కన ఉన్న లైటు ఒరిజినల్ అద్దానికి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉంది. చూడటానికి కొత్త గ్లాసు ఏర్పాటు చేశారేమో అని అనిపిస్తుంది. ప్లాస్టిక్ మూతను అమర్చిన ఆ వ్యక్తి.. రెండు లైట్లకు తేడా చూపిస్తూ వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇది కదా తెలివి అంటే’’.. అని కొందరు, ‘‘ఎలా వస్తాయయ్యా... ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.60లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Tasty Food: మరుసటి రోజు తింటే.. అదిరిపోయే రుచిని అందించే.. ఆ 5 వంటకాలు ఏంటంటే..

Updated Date - Jan 23 , 2024 | 09:19 PM