Viral Video: ఈ కూలర్ని చోరీ చేయడం ఎవరి తరమూ కాదేమో.. ఇతడి ముందు జాగ్రత్త మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Mar 26 , 2024 | 04:39 PM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వేసవి ప్రారంభమవడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయికి తగ్గట్టు ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి..
ఇళ్లల్లో వస్తువులు చోరీ కాకుండా కొందరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటారు. మరికొందరు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ దొంగలు కూడా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి తన కూలర్ చోరీ కాకుండా విచిత్ర ప్రయోగం చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా .. ‘‘ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వేసవి ప్రారంభమవడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయికి తగ్గట్టు ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి తన ఇంట్లోని కూలర్ చోరీ కాకుండా.. వినూత్నంగా ఏర్పాటు చేశాడు. ఇందుకోసం అతను ఏకంగా తన ఇంటి గోడకు పెద్ద రంధ్రం చేసి, అందులో (cooler installed in the middle of wall) కూలర్ని ఏసీ తరహాలో ఏర్పాటు చేశారు.
గోడ బయటికి కొంత భాగం కనిపించేలా ఏర్పాటు చేశాడు. ఇతడు చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ట్రాక్టర్లో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ కూలర్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వెంటనే వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘ఇతడి ఐడియా మామూలుగా లేదుగా’’.., ‘‘ఇవి కదా అసలుసిసలైన తెలివితేటలు’’.., ‘‘పంజాబ్ వారి తెలివితేటలు మామూలుగా ఉండవు’’.. అంటూ కొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.