Share News

Viral Video: ఈ కోతి చేసిన చిన్న పొరపాటు.. చివరకు మరణానికి ఎలా దారి తీసిందో చూడండి..

ABN , Publish Date - Dec 19 , 2024 | 01:16 PM

కొన్నిసార్లు మనకు తెలీకుండా చేసే పొరపాట్ల కారణంగా చివరకు జీవితంలో అనూహ్య సమస్యలు పచ్చిపడుతుంటాయి. ఆ సమస్యలు చివరకు కొందరిని కోలుకోలేని దెబ్బ తీస్తుంటాయి. మరికొందరిని మృత్యుఒడిలోకి చేర్చుతుంటాయి. జంతువుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. ఇలాంటి ..

Viral Video: ఈ కోతి చేసిన చిన్న పొరపాటు.. చివరకు మరణానికి ఎలా దారి తీసిందో చూడండి..

కొన్నిసార్లు మనకు తెలీకుండా చేసే పొరపాట్ల కారణంగా చివరకు జీవితంలో అనూహ్య సమస్యలు పచ్చిపడుతుంటాయి. ఆ సమస్యలు చివరకు కొందరిని కోలుకోలేని దెబ్బ తీస్తుంటాయి. మరికొందరిని మృత్యుఒడిలోకి చేర్చుతుంటాయి. జంతువుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి దారిలో వెళ్తుండగా మధ్యలో చేసిన చిన్న పొరపాటు చివరకు దాని మరణానికి దారితీసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఓ కోతి తన దారిన తాను వెళ్తుంటుంది. ఈ క్రమంలో దారి మధ్యలో ఓ నీటి గుంట కనిపిస్తుంది. అటుగా వెళ్తున్న కోతి నీటి గుంట దగ్గరగా వెళ్తుంటుంది. కోతి తనకు తెలీకుండానే చేసిన ఈ ఒక్క పొరపాటుతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఆ నీటి కుంటలో వేట కోసం పొంచి ఉన్న మొసలి.. కోతి దగ్గరగా రాగానే (Crocodile attack on monkey) ఒక్కసారిగా పైకి లేచి పట్టుకుంటుంది.

Viral Video: నీ టాలెంట్‌కు హ్యట్సాప్ బ్రదర్.. రంపం మిషిన్‌తో ఇతడు చేసిన విన్యాసం చూస్తే..


మొసలి ఇలా ఊహించని విధంగా దాడి చేయడంతో కోతి షాక్ అవుతుంది. దాన్నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా మొసలి దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుని నీటిలోకి లాక్కుంటుంది. చివరకు కోతిని నీటి లోపలికి లాక్కెళ్లిపోయి చంపేస్తుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరికొన్ని కోతులు భయంతో పారిపోతాయి. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది.

Viral Video: ఫోన్ పిచ్చిలో పడితే ఇలాగే జరుగుతుంది.. వంట చేస్తూ ఫోన్ చూస్తుండగా.. సడన్‌గా..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఈ కోతిని చూస్తుంటే చాలా బాధగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘విధిని ఎవరూ తప్పించలేరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 39 వేలకు పైగా లైక్‌లు, 3.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 19 , 2024 | 01:16 PM