Share News

Viral Video: సుడిగాలి వస్తుందేమో అనుకున్నారు.. కానీ సమీపానికి వచ్చాక చూస్తే.. మైండ్ బ్లాకింగ్ సీన్...

ABN , Publish Date - Feb 11 , 2024 | 08:18 PM

ఆకాశం నుంచి వింత వింత జీవులు నేలపై పడిన సందర్భాలు చూశాం. అలాగే భారీ సుడిగాలుల కారణంగా జనం ఇబ్బందులు పడిన సందర్భాలను చూశాం. అయితే కొన్నిసార్లు అంతకు మించి.. అన్నట్లుగా వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి..

Viral Video: సుడిగాలి వస్తుందేమో అనుకున్నారు.. కానీ సమీపానికి వచ్చాక చూస్తే.. మైండ్ బ్లాకింగ్ సీన్...

ఆకాశం నుంచి వింత వింత జీవులు నేలపై పడిన సందర్భాలు చూశాం. అలాగే భారీ సుడిగాలుల కారణంగా జనం ఇబ్బందులు పడిన సందర్భాలను చూశాం. అయితే కొన్నిసార్లు అంతకు మించి.. అన్నట్లుగా వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆకాశంలో వింత దృశ్యం చూసి అంతా మొదట సుడిగాలి వస్తుందేమో అనుకున్నారు. అయితే తీరా సమీపానికి వచ్చాక చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పూణేలోని (Pune) ముఠా నదిపై ఈ ఘటన చోటు చేసుకుంది. నదీ తీరంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు నదికి సమీపంలో ఆకాశంలో వింత దృశ్యం కనిపించింది. దాన్ని చూసి అంతా సుడిగాలేమో అని అనుకున్నారు. అయితే సమీపానికి రాగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు. దోమల గుంపు (mosquitoes swarm) తెరలు తెరలుగా అచ్చం సుడిగాలి తరహాలో దూసుకురావడం చూసి అవాక్కయ్యారు. వామ్మో! ఇదెక్కడి వింతరా నాయనా.. అని అనుకుంటూ కొందరు అక్కడి నుంచి పరుగులు తీశారు.

Viral Video: అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. మహిళ మంచు తొలగిస్తుండగా.. మధ్యలో..

మరికొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. నదిలో కాలుష్యం పెరిగిపోవడానికి ఇదే నిదర్శనమని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు స్థానికులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ఈ దోమల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇలాంటి దృశ్యం.. ఎక్కడా చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘పరిస్థితి చాలా భయంకరంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏవమ్మా..! అది కొండచిలువ అనుకున్నావా.. కోడిపిల్ల అనుకున్నావా.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

Updated Date - Feb 11 , 2024 | 08:19 PM