Share News

Viral Video: ఆత్మహత్యకు సిద్ధమైన యువతి.. బ్రిడ్జి పైనుంచి దూకుతుండగా.. వెనుక నుంచి ఉన్నట్టుండి..

ABN , Publish Date - Dec 14 , 2024 | 08:36 AM

ప్రస్తుత యువత చిన్న చిన్న సమస్యలకూ కుంగిపోవడం, చివరకు షాకింగ్ నిర్ణయాలు తీసుకోవడం సర్వసాధారణమైంది. కొందరు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం చేయలేక చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ..

Viral Video: ఆత్మహత్యకు సిద్ధమైన యువతి.. బ్రిడ్జి పైనుంచి దూకుతుండగా.. వెనుక నుంచి ఉన్నట్టుండి..

ప్రస్తుత యువత చిన్న చిన్న సమస్యలకూ కుంగిపోవడం, చివరకు షాకింగ్ నిర్ణయాలు తీసుకోవడం సర్వసాధారణమైంది. కొందరు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం చేయలేక చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. చివరకు జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి పెద్ద బ్రిడ్జిపై పిల్లర్ చివరన కూర్చుని, కిందకు దూకి (young woman tried to commit suicide) ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో అక్కడున్న వారు గమనించి.. దూకొద్దు.. దూకొద్దు.. అంటూ కేకలు వేస్తారు. అయినా ఆ యువతి వారి మాటలు వినిపించుకోకుండా దూకేందుకు ప్రయత్నిస్తుంటుంది. చూస్తుండగానే అక్కడ జనం గుమికూడతారు.

Viral Video: చెప్పులు ఆర్డర్ చేసిన యువతికి షాక్.. వస్తువు వచ్చింది కానీ.. తీక్షణంగా పరిశీలించగా..


అయితే కాపాడేందుకు ప్రయత్నిస్తే.. దూకేస్తానని బెదిరించడంతో ఎవరూ సాయసం చేయరు. ఇతలో సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు అక్కడికి చేరుకుంటాయి. వారిలో ఓ వ్యక్తి ఆమె వెనుకే బ్రిడ్జిపై నిలబడి ఉంటాడు. యువతిని ఏమార్చి మెల్లగా వెనుక వైపు నుంచి పిల్లర్‌పైకి దిగుతాడు. దిగగానే ఆమె కిందకు దూకకుండా గట్టిగా పట్టుకుంటాడు. దీంతో ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో మరో వ్యక్తి పిల్లర్‌ పైకి దిగి ఆమెను పట్టుకుంటాడు.

Viral Video: తెలిసి తప్పు చేయడమంటే ఇదే.. రైలుకు వేలాడుతున్న యువతి.. చూస్తుండగానే..


ఇలా చివరకు ఇద్దరూ కలిసి ఆమెను ఎత్తుకుని పైకి బ్రిడ్జి పైకి అందిస్తారు. ఇలా ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించి యువతిని కాపాడారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు అభినందనీయం’’.. అంటూ కొందరు, ‘‘ఆత్మహత్య చేసుకోవడం పెద్ద నేరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వయసు మీదపడుతున్నా బుద్ధి మారలేదు.. యువతి పక్కన డాన్స్ చేస్తున్న వృద్ధుడి నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 14 , 2024 | 08:37 AM