Viral Video: వయసు కేవలం సంఖ్య మాత్రమే.. ఈ పెద్దాయన టాలెంట్ చూస్తే గూస్‌బమ్స్ ఖాయం..
ABN , Publish Date - Dec 08 , 2024 | 07:52 PM
కొందరికి వయసు కేవలం సంఖ్య మాత్రమే. చూసేందుకు వృద్ధుల్లా కనిపిస్తున్నా వారి చేష్టలు, వారు చేసే విన్యాసాలు చూస్తే యువకులు కూడా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. కొందరు వృద్ధులైతే యువకులు కూడా చేయలేని విన్యాసాలను ఎంతో ఈజీగా చేసేస్తుంటారు. ఇలాంటి ..
కొందరికి వయసు కేవలం సంఖ్య మాత్రమే. చూసేందుకు వృద్ధుల్లా కనిపిస్తున్నా వారి చేష్టలు, వారు చేసే విన్యాసాలు చూస్తే యువకులు కూడా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. కొందరు వృద్ధులైతే యువకులు కూడా చేయలేని విన్యాసాలను ఎంతో ఈజీగా చేసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు బైకుపై చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వృద్ధుడు (old man) బైకుపై చేసిన విన్యాసం (Bike stunt) చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బైకుపై వెనుక వైపు ఖాళీ సిలిండర్‌ను కట్టిన వృద్ధుడు.. బండి రన్నింగ్‌లో ఉండగా, సీటు పైనుంచి లేచి సిలిండర్‌పై (cylinder) కూర్చున్నాడు. సిలిండర్‌పై కూర్చున్న ఆయన.. కాళ్లను బైకు స్టీరింగ్‌పై పెట్టి కంట్రోల్ చేస్తున్నాడు.
Viral Video: బార్బర్‌కు షాకిచ్చిన యువకుడు.. సెలూన్‌లో గుండు కొట్టించుకున్న వ్యక్తి.. చివరకు..
అంత ప్రమాదకరంగా కూర్చున్నా కూడా ఎక్కడా ఆయనలో భయం కనిపించదు. పైగా బైక్ రైడ్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు. కాళ్లతో బైక్ హ్యాండిల్‌ను కంట్రోల్ చేస్తూ అందరితో పాటూ రోడ్డుపై స్పీడ్‌గా వెళ్లడం చూసి మిగతా వాహనాదారులు షాక్ అయ్యారు. అయితే ఈ క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అయినా ఆ వృద్ధుడు మాత్రం బైకును ఎంతో చాకచక్యంగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Viral Video: ఈ ట్రిక్ ఎప్పుడైనా ట్రై చేశారా.. చేతి నుంచి గాజులను ఎలా తీస్తుందో చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ పెద్దాయన టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 89 వేలకు పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. కత్తితో ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..