Share News

Viral Video: గుర్రానికి షాక్ ఇచ్చిన పొట్టేలు.. చివరికి ఏం చేసిందో చూస్తే.. అవాక్కవాల్సిందే..

ABN , Publish Date - Oct 14 , 2024 | 08:18 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ షెడ్‌లో కొన్ని పొట్టేళ్లు మేత మేస్తుంటాయి. ఇంతలో అక్కడికి ఓ గుర్రం వస్తుంది. తమ ఆహారాన్ని ఎక్కడ ఈ గుర్రం తినేస్తుందని అనుకుందో ఏమో గానీ.. ఓ పొట్టేలు ఆవేశంగా గుర్రానికి ఎదురుగా వెళ్లింది. వెళ్లీ వెళ్లీగానే..

Viral Video: గుర్రానికి షాక్ ఇచ్చిన పొట్టేలు.. చివరికి ఏం చేసిందో చూస్తే.. అవాక్కవాల్సిందే..

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద జంతువులకు చిన్న చిన్న జంతువులు ఊహించని షాక్‌లు ఇస్తుంటాయి. ఆఖరికి పులులు, సింహాలు వంటి క్రూర మృగాలకూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ఈ తరహా విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ గుర్రం, పొట్టేలు వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పొట్టేలు గుర్రానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఈ పొట్టేలు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ షెడ్‌లో కొన్ని పొట్టేళ్లు మేత మేస్తుంటాయి. ఇంతలో అక్కడికి ఓ గుర్రం వస్తుంది. తమ ఆహారాన్ని ఎక్కడ ఈ గుర్రం తినేస్తుందని అనుకుందో ఏమో గానీ.. ఓ పొట్టేలు ఆవేశంగా గుర్రానికి ఎదురుగా వెళ్లింది. వెళ్లీ వెళ్లీగానే దాని కాళ్ల కింద దూరి ధబేల్‌మని కిందపడేసింది.

Viral Video: కారులో కూర్చుని ఖంగుతిన్న వ్యక్తి.. డోరు వేయాలని చూడగా.. షాకింగ్ సీన్..


పొట్టేలు దాటికి కిందపడ్డ గుర్రం.. కుయ్యో మొర్రో.. అని అనుకుంటూ అక్కడి నుంచి తోక ముడిచి పారిపోతుంది. ఇలా గుర్రంలో సగం హైట్ కూడా లేని పొట్టేలు.. ఏకంగా దాన్నే కిందపడేసిన ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వివిధ వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: స్కూటీతో దుస్తుల వాషింగ్.. ఇతడి తెలివి మామూలుగా లేదుగా..


ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పొట్టేలు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘హైట్, వెయిట్ చూసి ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 100కి పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అరటి, యాపిల్, జామపండుతో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే.. ఖంగుతినాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 14 , 2024 | 08:18 AM