Share News

Viral Video: మేడపై మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన పులి.. చివరకు జరిగిందేంటంటే..

ABN , Publish Date - May 28 , 2024 | 08:59 PM

జనావాసాల్లోకి జంతువులు చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: మేడపై మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన పులి.. చివరకు జరిగిందేంటంటే..

జనావాసాల్లోకి జంతువులు చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులు మేడపై కూర్చుని మాట్లాడుకుంటుండగా.. ఓ పెద్ద పులి సడన్‌గా దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు మేడపై కూర్చుని మట్లాడుకుంటుంటారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. గ్రామంలోకి చొరబడ్డ ఓ పెద్ద పులి.. ఎటు వెళ్లాలో తెలీక చివరకు వీరి ఇంట్లో చొరబడుతుంది. ఈ క్రమంలో చివరకు మేడ పైకి వచ్చేస్తుంది. వచ్చీ రాగానే అక్కడ ఉన్న ఇద్దరిపై దాడికి తెగబడుతుంది. ఉన్నట్టుండి పులిని చూసిన వారు కాసేపట్లోనే తేరుకుని పులిపై పోరాటానికి దిగారు. వారిలో ఓ వ్యక్తి తన చేతిలోని ( man attacked the tiger) కర్రతో పులిపై దాడి చేశాడు.

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ప్రేమికుల గొడవ.. చివరకు ప్రియురాలు చేసిన పనికి అంతా షాక్..


దీంతో చివరకు పులి భయంతో వారిని వదిలేస్తుంది. తర్వాత వారిద్దరూ పులిని అక్కడి నుంచి తరిమేందుకు మళ్లీ కర్రతో కొడతారు. దీంతో పులి చివరకు అక్కడి పారిపోతుంది. దీంతో వారు చివరకు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘వీళ్ల ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి రైలు ప్రయాణం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీళ్ల నిర్వాకం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Updated Date - May 28 , 2024 | 08:59 PM