Share News

Viral: ఈ జూలో ప్రతి శనివారం పులులకు ఉపవాసం.. ఎందుకో తెలిస్తే..

ABN , Publish Date - Apr 12 , 2024 | 03:42 PM

పులులకు ఊబకాయం రాకుండా ఉండేందుకు నేపాల్లోని ఓ జూలో ప్రతి శనివారం పులులకు మాంసాహారం ఇవ్వట్లేదు. ఇలాంటి ఉపవాశాలతో వాటి ఆరోగ్యం మెరుగవుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

Viral: ఈ జూలో ప్రతి శనివారం పులులకు ఉపవాసం.. ఎందుకో తెలిస్తే..
Tiger fasting in Nepal Zoo

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవాల్లో పులులు ముందుంటాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వీటి బారిన పడే జంతువు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అలాంటి పులులతో ఓ జంతుప్రదర్శనశాల ఉపవాసం చేయిస్తోందంటే ఆశ్చర్యంగా (Viral) కలగకమానదు. మరి ఈ జూ ఎక్కడ ఉందో, ఎందుకు ఇలా పులులు పస్తులు ఉంచుతున్నారో తెలుసుకుందాం పదండి.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, నేపాల్‌లో ఉన్న ఈ జంతుప్రదర్శనశాల పేరు సెంట్రల్ జూ. ఇక్కడ ప్రతి శనివారం పులులతో ఉపవాసం చేయిస్తారు. ఆ రోజు పులికి కాస్తంత మాంసాహారం కూడా పెట్టరు. అయితే, పులుల బాగుకొరకే వాటిని ఇలా తిండి లేకుండా మాడుస్తున్నట్టు అక్కడి అధికారులు చెప్పారు. వారానికి ఒక రోజు తిండి లేకపోతే పులులకు పెద్ద ఇబ్బంది కూడా ఉండదని చెప్పుబున్నారు (Tiger made to fast on every saturday in nepal zoo).

Viral: మెట్రో రైళ్లల్లోనూ ఈ మరకలా.. నెటిజన్లలో పెల్లుబుకుతున్న ఆగ్రహం.. జరిగిందేంటంటే..


ఈ ఉపవాసాల వెనక ఆరోగ్య సూత్రం ఉందని అక్కడి అధికారులు భరోసా ఇచ్చారు. సాధారణంగా అక్కడ ఆడ పులికి రోజుకు 5 కేజీల గేదె మాంసం, మగ పులులకు 6 కేజీల మాంసం పెడతారు. కానీ శనివారాలు మాత్రం వాటికి మాంసం వాసన కూడా చూపించరు. ఇలా వారానికి ఒక రోజు వాటిని తిండి పెట్టకపోతే వాటి బరువు నియంత్రణలో ఉండి ఆరోగ్యం బాగుంటుందని జూ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఉపవాసాల కారణంగా వాటి జీర్ణశక్తి మెరుగవుతుందని కూడా అంటున్నారు. పులులకు ఊబకాయం వస్తే రకరకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయని పుశువైద్యులు చెబుతున్నారు.

Viral: అప్పుడే పుట్టిన మనవడిని చూడగానే అత్తకు డౌట్.. కోడలికి బలవంతంగా డీఎన్‌ఏ టెస్టు చేయిస్తే..

పులులకు చికిత్సలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో వాటి ఆరోగ్యం కాపాడాలంటే ఉపవాసాలే మంచి మార్గమని అక్కడి వారు చెబుతున్నారు. రెగ్యులర్ ఉపవాసాలతో వాటి ఆరోగ్యం మెరుగవుతుందని అంటున్నారు.

జంతుశాస్త్రవేత్తల ప్రకారం, అడవుల్లో ఉండే పులులు రకరకాల ఆహారాన్ని తీసుకుంటాయి. చిన్న కీటకాల నుంచి భారీ ఏనుగుల వరకూ అనేక ప్రాణులను తింటాయి. అయితే, అవి అత్యధికంగా మూస్, జింకలు, పందులు, గేదెలు, గుర్రాలు వంటివాటిని తింటాయి. అప్పుడప్పుడూ అడవి కుక్కలు, భల్లూకాలు, ఖడ్గ మృగాలను కూడా టార్గెట్ చేస్తుంటాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2024 | 04:00 PM