Puzzle: ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలు ఉన్నాయి.. కనిపెట్టారంటే మీది కత్తి లాంటి చూపే..
ABN , Publish Date - Mar 09 , 2024 | 08:23 PM
ఆప్టికల్ ఇల్యూజన్, ఫజిల్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి ఫజిల్స్ పరిష్కరించేందుకు నెటిజన్లు కూడా తెగ ఆసక్తిని కనబరుస్తుంటారు. కొన్ని ఫజిల్ ఫొటోలు చూసేందుకు ఒకేలా ఉన్నా.. వాటిలో అనేక తేడాలు ఉంటాయి. చివరకు..
ఆప్టికల్ ఇల్యూజన్, ఫజిల్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి ఫజిల్స్ పరిష్కరించేందుకు నెటిజన్లు కూడా తెగ ఆసక్తిని కనబరుస్తుంటారు. కొన్ని ఫజిల్ ఫొటోలు చూసేందుకు ఒకేలా ఉన్నా.. వాటిలో అనేక తేడాలు ఉంటాయి. చివరకు సమాధానం తెలిశాక.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. అలాంటి ఆసక్తికర ఫొటోను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో కనిపెట్టారంటే.. మీది గద్ద లాంటి చూపు అని అర్థం.
సోషల్ మీడియాలో ఫజిల్ ఫొటో (Viral Fuzzy photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో ఓ బాలుడు దుప్పటి కప్పుకొని పడుకుని ఉంటాడు. అతడి బెడ్రూం కిటికీ కర్టన్లు తీసి ఉంటాయి. కిటికీ బయట ఆకాశంలో అందమైన దృశ్యం కనిపిస్తుంటుంది. మేఘాలపై చందమామతో పాటూ చుట్టూ అందమైన చుక్కలు మెరుస్తూ ఉంటాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. ఈ రెండు ఫొటోల్లో మొత్తం మూడు తేడాలు ఉన్నాయి. వాటిని కనిపెట్టడం అంత ఈజీ ఏమీ కాదు. ఎంతో తీక్షణంగా చూస్తే తప్ప ఆ తేడాలను గుర్తించడం సాధ్యం కాదు. ఇంకెందుకు ఆలస్యం ఆ తేడాలను గుర్తించేందుకు ట్రై చేయండి మరి. ఒకవేళ మీకు సాధ్యం కాకపోతే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Viral: రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన డ్రైవర్.. లారీని శుభ్రం చేస్తుండగా వచ్చిన ఆ ఒక్క ఆనుమానమే..
Optical illusion: పెయింటింగ్ వేస్తున్న ఈ పిల్లాడి ఫొటోలో పెద్ద తప్పు ఉంది.. అదేంటో చెప్పగలరా..?
Optical illusion: ఈ పార్కులో ఓ సింహం దాక్కుంది.. దాన్ని కనిపెట్టగలిగితే మీరే కింగ్..
మరిన్ని వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి