Share News

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న కుక్క పిల్లను 20 సెకన్లలో కనుక్కోవడం మీ వల్ల అవుతుందా..

ABN , Publish Date - Oct 08 , 2024 | 03:51 PM

మన కంటికి పరీక్ష పెట్టడంతో పాటూ మేథస్సుకు పదును పెట్టే సాధనాలు సోషల్ మీడియాలో నిత్యం అనేకం చూస్తుంటాం. అయితే వాటిలో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను ఆకట్టుకోవడంలో ముందుంటాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. కొన్ని చిత్రాల్లోని ..

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న కుక్క పిల్లను 20 సెకన్లలో కనుక్కోవడం మీ వల్ల అవుతుందా..

మన కంటికి పరీక్ష పెట్టడంతో పాటూ మేథస్సుకు పదును పెట్టే సాధనాలు సోషల్ మీడియాలో నిత్యం అనేకం చూస్తుంటాం. అయితే వాటిలో పజిల్స్, ఆప్టి్కల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను ఆకట్టుకోవడంలో ముందుంటాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. కొన్ని చిత్రాల్లోని పజిల్స్‌ను పరిష్కరించడం కష్టతరమైనా.. పరిష్కారం కోసం ప్రయత్నించడం వల్ల మెదడు మరింత చురుగ్గా మారుతుంది. తాజాగా, ఇలాంటి ఓ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కుని ఉన్న కుక్క పిల్లను 20 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి.


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఆల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ కాలువ ఒడ్డున ఉన్న పార్క్‌లో కొందరు కూర్చుని ఉంటారు. ఓ బెంచిపై కూర్చున్న వృద్ధుడు.. పావురాలకు గింజలు వేస్తుండగా.. ఎదురుగా ఉన్న బెంచిపై ఓ ప్రేమ జంట కూడా కూర్చుని ఉంటుంది.

Optical illusion: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయి.. అవేంటో 30 సెకన్లలో కనుక్కుంటే మీరే తోపు..


అలాగే ఇటు పక్కన ఓ బాలిక బెలూన్లు ఎగరేస్తూ ఆడుకుంటూ ఉంటుంది. ఆ పక్కనే ఓ యువతి తప్పిపోయిన తన కుక్క పిల్లకు సంబంధించిన పోస్టర్‌ను బోర్డుపై అంటిస్తుంటుంది. వారికి సమీపంలోనే మరో ఇద్దరు పిల్లలు ఐస్ క్రీం తింటూ మాట్లాడుకుంటుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే మీ కంటికి ఓ పరీక్ష పెడుతున్నాం. సదరు యువతికి దొరక్కుండా ఆమె కుక్క పిల్ల (Hiding puppy) ఇదే ప్రాంతంలో దాక్కుని ఉంటుంది.

Optical illusion: వర్షంలో క్యాంపింగ్ కోసం వెళ్తున్న వీరికి.. 20 సెకన్లలో గొడుకు వెతికిపెట్టండి చూద్దాం..


అయితే ఎంత వెతికినా కనిపించకపోయే సరికి.. ఆమె ఇలా తన కుక్క పిల్లను వెతికిపెట్టడంటూ పోస్టర్లు అంటిస్తోంది. కాబట్టి.. ఆ కుక్క పిల్ల ఎక్కడ దాక్కుని ఉందో కనిపెట్టి.. సదరు యువతికి సాయం చేయండి. ఆ కుక్క పిల్లను కనుక్కునేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న సుత్తిని 40 సెకన్ల లోపు గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లే..


ఇంకెందకు ఆలస్యం.. ఆ కుక్క పిల్ల ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించడి. మీకు 20 సెకన్ల సమయం ఇస్తున్నాం. ఈలోపు ఆ కుక్క పిల్లను గుర్తిస్తే మీరు ఎంతో ప్రతిభావంతులని అర్థం. ఒకవేళ ఇప్పటికీ గుర్తించలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-phot.jpg

Optical illusion: చురుకైన చూపు ఉన్న వారు మాత్రమే.. ఈ సరస్సులో దాక్కున్న మొసలిని 20 సెకన్లలో కనుక్కోగలరు..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 08 , 2024 | 03:51 PM