Viral Video: ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూడలేదే.. వేడి నుంచి ఉపశమనం కోసం డ్రైవర్ ఏం చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Apr 24 , 2024 | 02:41 PM
ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో సగటున 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది అనవసరంగా బయటకు రావడం మానేశారు
ప్రస్తుతం దేశంలో ఎండలు (Summer) మండిపోతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో సగటున 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది అనవసరంగా బయటకు రావడం మానేశారు. తప్పనిసరిగా బయట తిరగాల్సిన వారు వేడి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే (Viral Video).
@fewsecl8r అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ట్రక్ డ్రైవర్ (Truck Driver) మిట్ట మధ్యాహ్నం వేళ ప్రయాణిస్తున్నాడు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వెరైటీగా ప్లాన్ చేశాడు. డ్రైవింగ్ సీటు పక్కన బకెట్‌తో నీళ్లు పెట్టుకున్నాడు. మధ్య మధ్యలో మగ్‌తో నీళ్లు (Water) తీసుకుని పై నుంచి వేసుకుంటున్నాడు. మండే ఎండలో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఇది మంచి ట్రిక్. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోకు తక్కువ వ్యవధిలోనే 7.5 వేలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``అన్ని ట్రక్కుల్లోనూ ఏసీ కచ్చితంగా ఉండాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి``, ``పాపం.. ఇంతకు మించి చేసేదేముంది``, ``అంత వేడిలో స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరం``, ``ఇది రీల్స్ కోసం చేసినట్టు ఉన్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..