Share News

Viral Video: ఇంట్లోకి చొరబడుతున్న దొంగలు.. మహిళ తెలివిగా చేసిన పనితో.. చివరకు..

ABN , Publish Date - Oct 02 , 2024 | 07:25 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో ఇటీవల ఓ రోజు దొంగలు చొరబడ్డారు. ఆ సమయంలో మహిళ తన పిల్లలతో ఒంటరిగా ఉంది. రోడ్డు వైపు నుంచి ఆ ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లారు. ముగ్గురు దొంగలు తలో వైపు వెళ్లి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు.. అయితే..

Viral Video: ఇంట్లోకి చొరబడుతున్న దొంగలు.. మహిళ తెలివిగా చేసిన పనితో.. చివరకు..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. చోరీ ఘటనల సమయంలో చోటు చేసుకునే షాకింగ్ ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలను చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొందరు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు దొంగలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంట్లోకి చొరబడుతున్న దొంగలను ఓ మహిళ ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పంజాబ్ (Punjab) అమృత్‌సర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొహాలీలోని ఓ ఇంట్లో ఇటీవల ఓ రోజు దొంగలు (thieves) చొరబడ్డారు. ఆ సమయంలో మహిళ (woman) తన పిల్లలతో ఒంటరిగా ఉంది. రోడ్డు వైపు నుంచి ఆ ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లారు. ముగ్గురు దొంగలు తలో వైపు వెళ్లి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు.

Viral Video: ఈమేంటీ రైల్లో ఇలా చేసిందీ.. కిందపడ్డ ఆమె బ్యాగును చూసి అంతా షాక్.. చివరకు..


అయితే దొంగలు ఇంట్లోకి రావడాన్ని పసిగట్టిన మహిళ.. వారు ఇంట్లోకి రాకుండా డోరు మూసింది. అయితే అప్పటికే డోరు వద్దకు వచ్చిన దొంగలు.. లోపలికి వచ్చేందుకు డోరు బలంగా తోశారు. అయితే ఆమె కూడా ఏమాత్రం భయపడకుండా డోరును గట్టిగా పట్టుకుని లాక్ చేసింది. ఆ తర్వాత అక్కడే ఉన్న సోఫాను అతి కష్టం మీద లాగి, డోరుకు అడ్డంగా పెట్టింది. ఆ తర్వాత ఫోన్ తీసుకుని తెలిసిన వారితో పాటూ పోలీసులకూ కాల్ చేసింది. దొంగలు చాలా సేపు ఇంట్లోకి రావాలని ప్రయత్నించి, అది కుదరకపోవడంతో చివరకు అక్కడి నుంచి పరారయ్యారు.

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘అలాంటి పరిస్థితుల్లోనూ ఎంతో తెలివిగా వ్యవహరించింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 59 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది కదా పెంపకం అంటే.. స్కూల్‌‌కు వెళ్తూ దారి మధ్యలో ఈ విద్యార్థి చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2024 | 07:25 PM