Share News

Viral Video: ఈమె తెలివి మామూలుగా లేదుగా.. ప్రెషర్ కుక్కర్‌పై ఆయిల్ పోసి.. ఆ సమస్యకు చెక్ పెట్టిందిగా..

ABN , Publish Date - Sep 26 , 2024 | 07:58 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వంటింట్లో వింత ప్రయోగం చేసింది. సాధారణంగా ప్రెషర్ కుక్కర్ విజిల్ వేసే సమయంలో ఆవిరితో పాటూ ఆహార పదార్థాలు కూడా బయటికి వస్తుంటాయి. దీంతో..

Viral Video: ఈమె తెలివి మామూలుగా లేదుగా.. ప్రెషర్ కుక్కర్‌పై ఆయిల్ పోసి.. ఆ సమస్యకు చెక్ పెట్టిందిగా..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పట్టణాల నుంచి పల్లెటూర్ల వరకూ మగవారితో పాటూ మహిళలు కూడా అనేక రకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటారు. కొందరు మహిళలు విచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరికొందరు వంటింటి చిట్కాలకు సంబంధించిన వీడియోలు చేస్తూ నెటిజన్లకు అవగాహన కల్పిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ప్రెషర్ కుక్కర్‌‌పై చేసిన ప్రయోగం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) వంటింట్లో వింత ప్రయోగం (strange experiment) చేసింది. సాధారణంగా ప్రెషర్ కుక్కర్ (Pressure cooker) విజిల్ వేసే సమయంలో ఆవిరితో పాటూ ఆహార పదార్థాలు కూడా బయటికి వస్తుంటాయి. దీంతో కుక్కర్ మొత్తం పాడవతుంటుంది. అయితే ఇలాంటి సమస్యకు ఆమె చక్కటి పరిష్కారం కనుక్కుంది.

Viral Video: ఎగరడానికి బద్ధకించిన పక్షులు.. విమానాన్ని ఎలా వాడుకున్నాయో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ప్రెషర్ కుక్కర్ మూతపై ఎన్న రంధ్రంలో కొన్ని చుక్కల ఆవాల నూనె వేసింది. ఆ తర్వాత మూత బయటికి తీసి, నూనెను చుట్టూ వేసింది. ఇలా మొత్తం నూనె వేసిన తర్వాత యథావిధిగా దాన్ని మూసేసి వంట స్టార్ట్ చేసింది. వంట మధ్యలో కుక్కర్ విజిల్ వేసింది. అయినా మూత రంధ్రం నుంచి ఆవిరి తప్ప ఎలాంటి ఆహార పదార్థాలూ బయటికి రాలేదు. ఇలా కుక్కర్ విషయంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యకు సదరు మహిళ నూనెతో చక్కటి పరిష్కారాన్ని కనుక్కుందన్నమాట.

Viral Video: మద్యం మత్తులో కుక్కకు ముద్దు పెట్టాడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మురికిగా కాకూదంటూనే.. నూనె పోసి అంతా పాడు చేశారుగా’’.. అంటూ కొందరు, ‘‘వంట చేసుకోవడానికే నూనె కొనలేకుంటే.. ఇలా పోయాలంటే ఎలా’’.. అంటూ మరికొందరు, ‘‘నూనెకు ఖర్చు చేసే బదులు.. నీటితో కడుక్కోవడం బెటర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 43 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వంటగదిలో పనిలో ఉన్న మహిళ.. సడన్‌గా కొండచిలువ ఎంట్రీ.. 2 గంటల తర్వాత లోపలికి వెళ్లి చూడగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 26 , 2024 | 07:58 PM