Share News

Women's : అమ్మాయిలు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణాలేంటి? అసలు నిజాలు ఇవీ..!

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:45 PM

కాలం మారుతున్నట్టే ప్రజల ఆలోచనా విధానం కూడా మారుతూ వస్తోంది. ఆడపిల్లలకు ఒకప్పుడు బాల్య వివాహాలు చేసేవారు. ఆ తరువాత అది మారి 16 నిండిన తరువాత వివాహం చెయ్యడం మొదలుపెట్టారు. ఆడపిల్లల ఆలోచనలే కాదు.. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల ఆలోచనలు కూడా మారుతున్నాయి.

Women's : అమ్మాయిలు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి  కారణాలేంటి? అసలు నిజాలు ఇవీ..!

కాలం మారుతున్నట్టే ప్రజల ఆలోచనా విధానం కూడా మారుతూ వస్తోంది. ఆడపిల్లలకు ఒకప్పుడు బాల్య వివాహాలు చేసేవారు. ఆ తరువాత అది మారి 16 నిండిన తరువాత వివాహం చెయ్యడం మొదలుపెట్టారు. ఆడపిల్లల ఆలోచనలే కాదు.. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల ఆలోచనలు కూడా మారుతున్నాయి. 20-22 ఏళ్ల లోపు పెళ్ళిళ్లు చేసే కాలం కూడా మారింది. ప్రస్తుత కాలంలో అమ్మాయిలు 30ఏళ్లు దాటిన పెళ్లికి సిద్దమవుతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? దీనివెనకున్న నిజాలేంటి? తెలుసుకుంటే..

చదువుకు ప్రాధాన్యత..

ఆడపిల్ల చదువుకుంటే తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా బ్రతకగలుగుతుంది. తన విద్యార్హతకు తగ్గట్టు ఏదో ఒక ఉద్యోగం చూసుకుని తన కాళ్ల మీద తాను నిలబడుతుంది. ఆత్మవిశ్వాసంతో బ్రతకగలుగుతుంది. ఈ కారణంగా ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చదివించే తల్లిదండ్రులు ఉన్నారు. గతంలో కంటే నేటికాలంలో ఆడపిల్లల అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆడపిల్లలలో వివాహం ఆలస్యం అవుతోంది.

ఈ మొఘల్ మహారాణుల తెలివితేటలు తెలిస్తే షాకవుతారు..!


ఆర్థిక విషయాలు..

చదువుకుని, ఉద్యోగం సంపాదించగానే ఆడపిల్లలు తృప్తి పడట్లేదు. తాము ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఉద్యోగం వచ్చాక సొంతంగా సంపాదించుకుని బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో కొంత ఉంచుకున్న తరువాతే పెళ్లికి సిద్దం అంటున్నారు. ఆర్థిక విషయాలలో వారు ఎవరిమీద ఆధారపడకూడదనే ఆలోచన వారిని పెళ్లికి తొందర పడకుండా ఆపుతోంది.

ఇష్టాలు..

పెళ్లయ్యాక కూడా ఏదైనా చేయవచ్చు. అందుకు కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది అని అందరూ అంటుంటారు. కానీ అమ్మాయిలు వాటికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. తమకున్న ఇష్టాలు, ప్రయాణాలు, తాము చెయ్యాలని అనుకున్న పనులు అన్నీ పెళ్లికి ముందే ఒక్కరే చేస్తూ ఆస్వాదించాలనే మైండ్ సెట్ అమ్మాయిలలో ఎక్కువగా ఉంది. ఇది కూడా పెళ్ళి ఆలస్యం కావడానికి ప్రధాన కారణం.

జాగ్రత్త.. ఈ శబ్దాలు వింటే వినికిడి లోపం రావడం ఖాయం..!


ఎంపిక..

నాకు కాబోయే భార్య ఇలా ఉండాలని అని అబ్బాయిలు వర్ణించి చెబుతూ ఉండేవారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అదే బాట పట్టారు. అబ్బాయి చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ, అందంగా ఉంటే సరిపోదు. అబ్బాయి అభిరుచుల దగ్గర నుండి భవిష్యత్ ప్రణాళికల వరకు ప్రతి విషయాన్ని అమ్మాయిలు సీరియస్ గా తీసుకుంటున్నారు. అంతేకాదు.. తమకు గౌరవం ఇవ్వాలని, తనను ప్రేమించాలని, తను అతని జీవితంలో చాలా ప్రత్యేకం అని అమ్మాయిలకి అనిపిస్తేనే పెళ్లికి సిద్దమవుతున్నారు. ఏ చిన్న విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. ఇలా నచ్చిన వ్యక్తి కోసం ఎదురుచూడటం వల్ల కూడా అమ్మాయిల పెళ్లి ఆలస్యం అవుతోంది.

జాగ్రత్త.. ఈ శబ్దాలు వింటే వినికిడి లోపం రావడం ఖాయం..!

ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 14 , 2024 | 03:45 PM