Share News

Viral: ఈ జొమాటో డెలివరీ ఏజెంట్‌ను చూసి కన్‌ఫ్యూజ్ అయిపోతున్న జనాలు.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Apr 16 , 2024 | 07:26 PM

హార్లీ డేవిడ్సన్ బైక్‌పై ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంత ఖరీదైన బైక్‌పై ఫుడ్ డెలివరీ చేయడమేంటని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Viral: ఈ జొమాటో డెలివరీ ఏజెంట్‌ను చూసి కన్‌ఫ్యూజ్ అయిపోతున్న జనాలు.. కారణం ఏంటంటే..
Zomato Delivery Agent on Harley Davidson Bike

ఇంటర్నెట్ డెస్క్: ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన కాసేపట్లోనే ఇంటికి తెచ్చిచ్చే డెలివరీ ఏజెంట్ల కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎండనకా వాననకా వారు నిత్యం బైకులు నడుపుతూ ఆర్డర్స్ డెలివరీ చేస్తుంటారు. పొట్టకూటి కోసం వారు పడే తిప్పల్ని అనేక మంది అర్థంచేసుకుని ఎంతోకొంత టిప్ ఇస్తుంటారు. అయితే, ఓ డెలివరీ ఏజెంట్‌ను చూసి మాత్రం జనాలు షాకైపోతున్నారు. అసలు ఇతను ఎవరో? అంటూ తెగ చర్చించేసుకుంటున్నారు. నెట్టింట ప్రస్తుతం వైరల్ (Viral) అవుతున్న ఈ వీడియో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ ఏకంగా హార్లీ-డేవిడ్‌సన్ బైక్‌పై ఆర్డర్లు డెలివరీ చేశాడు. అత్యంత ఖరీదైన బైక్‌పై అతడు దూసుకుపోతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పంచుకున్నాడు. దాదాపు రెండున్నర లక్షల ఖరీదుండే హర్లీ డేవిడ్సన్ బైక్‌ నడుపుతున్న అతడు డెలివరీ ఏజెంట్‌గా ఎందుకు పనిచేస్తున్నాడో తెలీక వీడియో చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు (Zomato delivery agent riding a Harley-Davidson has left Internet surprised).

Viral: ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థి జాబ్ వద్దన్నాడని.. హెచ్ఆర్ ఊహించని విధంగా..


నెటిజన్లను విపరీతంగా కన్‌ఫ్యూజ్ చేస్తున్న ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. కొందరు ఈ ఘటనపై సెటైర్లు పెలిస్తే మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు. పెట్రోల్ కోసం పుడ్స్ డెలివరీ చేస్తుండొచ్చని ఓ వ్యక్తి సరదా కామెంట్ చేశాడు. ఇంట్లో డబ్బులు అడగలేక ఇలా తనే సంపాదించుకుంటూ ఉండొచ్చని మరో వ్యక్తి కామెంట్ చేశారు. అతడు జొమాటో వ్యవస్థాపకుడు అయి ఉండొచ్చని కొందరు అన్నారు. గతంలో కొన్ని సందర్భాల్లో ఆయన ఇలా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. డెలివరీ ఏజెంట్లు స్ట్రైక్ చేస్తుండటంతో తనే స్వయంగా ఫుడ్ డెలివరీ చేస్తున్నాడని కొందరు సరదాగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 07:31 PM