INDIA vs SA Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచేదెవరు.. AI అనాలసిస్ ఇదే..!
ABN , Publish Date - Jun 29 , 2024 | 01:09 PM
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓవైపు కరేబీయన్ దీవుల్లో వర్షాలు పడుతుండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఈక్రమంలో మ్యాచ్‌పై ఎవరి అంచనాలు వారివి.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓవైపు కరేబీయన్ దీవుల్లో వర్షాలు పడుతుండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఈక్రమంలో మ్యాచ్‌పై ఎవరి అంచనాలు వారివి. వాస్తవానికి ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఊహించినదొకటి.. జరిగిందొకటి అన్నవిధంగా సాగాయి చాలా మ్యాచ్‌లు. సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో గట్టిపోటీ ఉంటుందని భావించినప్పటికీ.. భారత్ ఈజీగా విజయం సాధించి ఫైనల్స్ చేరింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించి టీమిండియా ఫైనల్స్ చేరింది. రెండు జట్లు సెమీస్‌లో భారీ విజయాలు నమోదుచేసి ఫైనల్స్ చేరాయి. దీంతో టైటిల్ విజేత ఎవరనేది ఆసక్తి రేపుతోంది. దక్షిణాఫ్రికా తొలిసారి కప్ గెలుస్తుందా.. భారత్ రెండోసారి టైటిల్ విన్నర్ అవుతందా అనే ఉత్కంఠకు కొద్దిగంటల్లో తెరపడనుంది.
India vs South Africa: ఫైనల్ మ్యాచ్‌కి ముందు.. భారత్ షాకింగ్ నిర్ణయం
AI అనాలసిస్..
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తీవ్ ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇవాల్టి మ్యాచ్‌పై అనాలసిస్ చేసింది. గతంలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా ఆటతీరు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా ఫైనల్ మ్యాచ్ విజేతపై ఓ అంచనాకు వచ్చింది. భారత జట్టు బలంగా ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికా లైనప్ చూసినప్పుడు సఫారీ జట్టుకు కొంత అనుకూలంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఏఐ అంచనా ప్రకారం సౌతాఫ్రికా తొలిసారి కప్ గెలిచే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
భారత్ బలం, బలహీనతలు..
టాప్ ఆర్డర్ బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్, ఫీల్డింగ్‌లో భారత్ మెరుగ్గా ఉన్నట్లు ఏఐ అంచనా వేసింది. డెత్ ఓవర్స్ బౌలింగ్‌లో జట్టు కొంచెం బలహీనంగా ఉందని, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ కూడా బలహీనంగా ఉన్నట్లు అంచనా వేసింది. ఇక భారత జట్టులో కీలక ఆటగాళ్ల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అర్షదీప్ సింగ్, బూమ్రా, అక్షర పటేల్ భారత జట్టులో బలమైన ఆటగాళ్లుగా ఉన్నారని.. వీరి ప్రదర్శపై జట్టు గెలుపోటములు ఆధారపడతాయని ఏఐ అంచనా వేసింది.
దక్షిణాఫిక్రా బలం, బలహీనతలు..
బ్యాలెన్స్డ్ బ్యాటింగ్ లైనప్, పేస్ బౌలింగ్, ఫీల్డింగ్‌లో దక్షిణాఫిక్రా జట్టు మెరుగ్గా ఉందని ఏఐ అంచనా వేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌లో ఆ జట్టు కొంచెం ఇబ్బంది పడుతుందని పేర్కొంది. ఇక దక్షిణాఫిక్రా జట్టులో క్వింటన్ డికాక్, మార్కరమ్, క్లాసెన్, రబాడా, షమ్సీ కీలక ఆటగాళ్లుగా ఉన్నట్లు తెలిపింది.
ఫైనల్ ప్రిడక్షన్..
టాప్ ఆర్డర్ బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ అటాక్‌తో భారతజట్టు బలంగా ఉందని.. అయితే సౌతాఫ్రికా బ్యాలెన్స్డ్ లైనప్, పేస్ బౌలింగ్ బలంగా ఉండటంతో ఆ జట్టుకు కొంతమేర కలిసొస్తుందని అంచనా వేసింది. తుది విజేత ఎవరనేది చెప్పడం అత్యంత కష్టమైనప్పటికీ.. దక్షిణాఫ్రికాకు ఫైనల్ మ్యాచ్‌లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
T20 World Cup final : ఈసారి వదలొద్దు!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Sports News and Latest Telugu News