Share News

BCCI: సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి బీసీసీఐ బంపర్ ఆఫర్!

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:15 PM

సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ స్పెషల్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల దులీప్ ట్రోఫీ 2024 సందర్భంగా ముషీర్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ దృష్టిని ఆకర్షించిన ముషీర్‌కు గుడ్ న్యూస్ రానున్నట్లు తెలిసింది.

BCCI: సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి బీసీసీఐ బంపర్ ఆఫర్!
musheer khan

టీమిండియా(team india) క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) సోదరుడు ముషీర్ ఖాన్‌(musheer khan)కు బీసీసీఐ నుంచి బంపర్ ఆఫర్ రాబోతున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఇటీవల దులీప్ ట్రోఫీ 2024 సందర్భంగా ముషీర్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ఆ క్రమంలో తొలి మ్యాచ్‌లోనే ముషీర్ సెంచరీ చేసి అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో ముషీర్ నిరంతరం అద్భుత ప్రదర్శన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ముషీర్ రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ, సెంచరీ చేసి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) దృష్టిలో పట్టాడు. దీంతో త్వరలో ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ నుంచి మంచి ప్రకటన రావచ్చని తెలిసింది.


ఇండియా ఏలో

ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా బీ తరఫున బ్యాటింగ్ చేసినప్పుడు ఇండియా ఏపై 181 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో BCCI ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన కోసం భారతదేశం ఏ జట్టులో ముషీర్ ఖాన్‌ను చేర్చవచ్చని తెలుస్తోంది. ముషీర్ ఖాన్ ఫిట్‌నెస్, ఫామ్‌ను పరిశీలిస్తే ఆస్ట్రేలియా Aతో ఆడటం ఖాయమని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఆస్ట్రేలియా టూర్‌లో బీసీసీఐ నిజంగా ముషీర్‌ను జట్టులోకి తీసుకుంటుందో లేదా అనేది చూడాలి మరి.


ఖాయమేనా

ఆస్ట్రేలియా పర్యటనలో ఇరు జట్ల మధ్య మూడు నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. నవంబర్‌లో భారత్ ఏ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ముషీర్ ఖాన్ రెడ్ బాల్ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో చాలా కాలం పాటు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. గతంలో అండర్-19 ప్రపంచకప్‌లో కూడా ముషీర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో ముషీర్ రెండు అద్భుతమైన సెంచరీలు చేశాడు. సమాచారం ప్రకారం భారతదేశం ఏ జట్టు దులీప్ ట్రోఫీ 2024, ఇరానీ కప్‌లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. ఈ క్రమంలో దులీప్ ట్రోఫీ తర్వాత ముషీర్ ఇరానీ కప్‌లో ఆడనున్నాడు.


ఇవి కూడా చదవండి

Viral News: ఈ హీరోయిన్లతో స్టార్ క్రికెటర్ డేటింగ్?.. నెట్టింట పిక్స్ వైరల్

Virender Sehwag: ధోనీ, కోహ్లీ, రోహిత్ ముగ్గురిలో ఎవరు బెస్ట్?.. సెహ్వాగ్ ఎవరి పేరు చెప్పాడంటే?

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2024 | 12:20 PM