Share News

Abhishek Sharma: అభిషేక్ శర్మ చెత్త రికార్డ్.. ఆ ముగ్గురి తర్వాత అతడే!

ABN , Publish Date - Jul 06 , 2024 | 10:28 PM

టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఓ చెత్ రికార్డ్‌ను నెలకొల్పాడు. ఐపీఎల్ తరహాలోనే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తాడని భావిస్తే.. అందుకు భిన్నంగా అతడు...

Abhishek Sharma: అభిషేక్ శర్మ చెత్త రికార్డ్.. ఆ ముగ్గురి తర్వాత అతడే!
Abhishek Sharma

టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఓ చెత్ రికార్డ్‌ను నెలకొల్పాడు. ఐపీఎల్ తరహాలోనే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తాడని భావిస్తే.. అందుకు భిన్నంగా అతడు డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో.. అంతర్జాతీయ టీ20 అరంగేట్రంలో డకౌట్ అయిన నాలుగో భారత ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు జాబితాలో అతని కంటే ముందు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కేఎల్ రాహుల్, పృథ్వీ షా ఉన్నారు.


జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా.. తొలి మ్యాచ్‌లో అభిషేక్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. స్పిన్నర్ బెన్నట్ బౌలింగ్‌లో తొలి నాలుగు బంతులను అతను డాట్ చేశాడు. అయితే.. ఐదో బంతికి భారీ షాట్ కొట్టబోయాడు. కానీ.. ఆ షాట్ సరిగ్గా పడకపోవడంతో, నేరుగా ఫీల్డర్ చేతికి చేరింది. దాంతో అతను డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తొలి టీ20 మ్యాచ్‌లో తనదైన మార్క్ చూపించలేకపోవడంతో.. అభిషేక్‌పై విమర్శలు వస్తున్నాయి. ఓపెనర్‌గా జట్టుకి శుభారంభం అందించి ఉంటే.. పరిస్థితులు మరోలా ఉండేవని కామెంట్లు చేస్తున్నారు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జింబాబ్వే చేతిలో భారత జట్టు 13 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఈ స్కోరు తక్కువే కావడంతో.. భారత్ సునాయాసంగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. యువ ఆటగాళ్లంతా చేతులు ఎత్తేయడంతో భారత్‌కి ఘోర పరాభావం ఎదురైంది. శుభ్‌మన్ గిల్ (29), సుందర్ (27) మాత్రమే పోరాటపటిమ కనబరిచారు. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. దీంతో.. భారత జట్టు 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 10:28 PM