IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
ABN , Publish Date - Nov 20 , 2024 | 09:57 PM
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా సమరానికి అంతా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఇరు జట్ల మధ్య భీకర యుద్ధం జరగనుంది. ఈ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
BGT 2024: సొంతగడ్డపై జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న జట్టు ఒకటి. మళ్లీ చెలరేగి ప్రత్యర్థి మెడలు వంచాలని ఉత్సాహంగా ఉన్న జట్టు మరొకటి. ఈసారి తప్పకుండా గెలిచి పోయిన పరువును తిరిగి దక్కించుకోవాలని చూస్తున్న టీమ్ ఒకటైతే.. మళ్లీ విజయబావుటా ఎగురవేసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్న టీమ్ మరొకటి. అందులో మొదటిది ఆస్ట్రేలియా అయితే రెండోది టీమిండియా. గత పర్యటనల్లో కంగారూలను ఓడించిన భారత్.. ఈసారీ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇంకోసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ముద్దాడాలని భావిస్తోంది.
పడిక్కల్ ఆడటం పక్కా!
గతంలో భారత్ చేతుల్లో ఓడి పరువు పోగొట్టుకున్న ఆసీస్.. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని అనుకుంటోంది. దీంతో ఈసారి టఫ్ ఫైట్ తప్పేలా లేదు. అయితే శుక్రవారం నుంచి మొదలయ్యే ఫస్ట్ టెస్ట్‌లో పిచ్, టాస్ లాంటి విషయాల కంటే రెండు జట్లు ఎలాంటి లైనప్‌తో బరిలోకి దిగుతాయనేది ఆసక్తికరంగా మారింది. భారత జట్టు విషయానికొస్తే.. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడు. కాబట్టి యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు జతగా సీనియర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను మొదలుబెడతాడు. ఫస్ట్ డౌన్‌లో మరో యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.
నలుగురిలో ఇద్దరికే ఛాన్స్
సెకండ్ డౌన్‌లో ఎలాగూ విరాట్ కోహ్లీ ఆడతాడు. అతడి తర్వాత వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటంగ్‌కు వస్తాడు. అనంతరం మరో వికెట్ కీపర్ జురెల్ దిగుతాడు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్ కోటాలో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవిచంద్రన్ అశ్విన్ లేదా రవీంద్ర జడేజాల్లో ఒకరు టీమ్‌లో ఉంటారు. ఆసీస్ జట్టులో ఎక్కువ మంది లెఫ్టాండర్లు ఉన్నారు. కాబట్టి అశ్విన్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపొచ్చు. తాత్కాలిక సారథి బుమ్రా పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. అతడితో పాటు సిరాజ్ ఎలాగూ జట్టులో ఉంటాడు. అయితే మరో స్థానం కోసం హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్ మధ్య పోటీ నెలకొంది. అదనపు వేగం, వేరియేషన్స్ కావాలంటే హర్షిత్.. స్వింగ్, సీమ్ కావాలంటే ఆకాశ్‌దీప్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవచ్చు.
భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్/రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా/ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్).
Also Read:
ఆసీస్‌పై భారత్ బ్రహ్మాస్త్రం.. దీన్ని ఛేదించాలంటే మొనగాళ్లు కావాలి
ఉన్న పళంగా ఆస్ట్రేలియాకు అగార్కర్.. ఆ నలుగురికి ఎర్త్ పెట్టేందుకే..
రోహిత్ వారసుడిగా రాహుల్.. ఆ టెక్నిక్ పట్టేస్తే తిరుగుండదు
For More Sports And Telugu News