Share News

Suryakumar Yadav: సూర్యకుమార్ తాత్కాలిక కెప్టెనే.. అసలు నాయకుడు అతడే!

ABN , Publish Date - Jul 30 , 2024 | 02:23 PM

టీ20ల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా ఉంటాడని అంతా అనుకుంటే.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను రంగంలోకి..

Suryakumar Yadav: సూర్యకుమార్ తాత్కాలిక కెప్టెనే.. అసలు నాయకుడు అతడే!
Suryakumar Yadav

టీ20ల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ (Rohit Sharma) తర్వాత హార్దిక్ పాండ్యానే (Hardik Pandya) కెప్టెన్‌గా ఉంటాడని అంతా అనుకుంటే.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను (Suryakumar Yadav) రంగంలోకి దింపింది. ఇతర ఆటగాళ్లు బరిలో ఉన్నప్పటికీ.. జట్టుని అంటిపెట్టుకుని ఉండే క్రికెటర్ అయితేనే ఉత్తమమని భావించి సూర్యని కెప్టెన్‌గా నియమించారు. అలాగే.. శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇలాంటి తరుణంలో.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


అతడే సరైనోడు

సూర్యకుమార్ కేవలం తాత్కాలిక కెప్టెన్ మాత్రమేనని, అసలైనోడు మరొకరు అని తెలిపాడు. ఇంతకీ అతనెవరా అని ఆలోచిస్తున్నారా..? మరెవరో కాదు.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill). అతను పదేళ్లపాటు భారత జట్టుకి కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఓ సందర్భంలో స్కాట్ స్టైరిస్ మాట్లాడుతూ.. ‘‘నేనైతే సూర్యకుమార్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారని భావిస్తున్నా. బహుశా హెడ్‌కోచ్ గంభీర్‌కు ఇప్పుడున్న వారిలో కెప్టెన్సీకి సరైన ఆటగాడు కనిపించడం లేదు. దీర్ఘకాలిక కెప్టెన్‌గా ఎవరు ఉండాలనే దానిపై గంభీర్‌ దృష్టి సారించాడని అనిపిస్తోంది. అందుకు శుభ్‌మన్ గిల్ సరైనోడని నా అభిప్రాయం. అతను పదేళ్ల పాటు టీమిండియా కెప్టెన్‌గా ఉండేందుకు ఛాన్స్ ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.


తెలివైన నిర్ణయం

కానీ.. ఇప్పుడు ఆ బాధ్యతలను చేపట్టేందుకు గిల్ సిద్ధంగా లేడని, అందుకే.. అతని కన్నా ఎక్కువ అనుభవం ఉన్న సూర్యను కెప్టెన్‌గా నియమించారని, ఇది తెలివైన నిర్ణయమేనని అన్నాడు. ఒకవేళ సూర్య నాయకుడిగా బాగా రాణిస్తే.. టీ20 వరల్డ్‌కప్ వరకూ అతడే కొనసాగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్‌ని.. లేకపోతే సత్తా ఉన్న మరో ఆటగాడిని నాయకుడిగా ఎంపిక చేయొచ్చని తెలిపాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోచ్‌గా గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు మంచివేనంటూ స్టైరిస్ కొనియాడాడు. కాగా.. అజిత్ అగార్కర్ సైతం భవిష్య కెప్టెన్ శుభ్‌మన్ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అతనికే తాము ఫుల్ మార్కులు వేస్తామన్నట్టుగా పేర్కొన్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 30 , 2024 | 02:23 PM