Share News

T20 World Cup: రోహిత్‌తో గొడవ.. ఓవరాక్షన్ చేసిన బంగ్లా బౌలర్‌పై ఐసీసీ కొరడా

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:00 PM

అప్పుడప్పుడే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువ ఆటగాళ్లు ‘యాటిట్యూడ్’ పేరుతో కాస్త దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ట్యాలెంట్ టన్నులకొద్దీ ఉంటుంది కానీ.. అంతకుమించి పొగరు చూపించి...

T20 World Cup: రోహిత్‌తో గొడవ.. ఓవరాక్షన్ చేసిన బంగ్లా బౌలర్‌పై ఐసీసీ కొరడా
Tanzim Sakib Fined 15 Percent Of Match Fee

అప్పుడప్పుడే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువ ఆటగాళ్లు ‘యాటిట్యూడ్’ పేరుతో కాస్త దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ట్యాలెంట్ టన్నులకొద్దీ ఉంటుంది కానీ.. అంతకుమించి పొగరు చూపించి విమర్శపాలవుతుంటారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చేతిలో అనవసరంగా మొట్టికాయలు తింటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ యువ పేసర్ తంజీమ్ సకీబ్ (Tanzim Sakib) కూడా ఎదురుదెబ్బలు తిన్నాడు. ప్రత్యర్థి ఆటగాడి పట్ల అతిగా ప్రవర్తించి నిబంధనలు ఉల్లంఘించినందుకు.. ఐసీసీ అతనిపై కొరడా ఝుళపించింది. ఇంకోసారి ఇలాంటి పని చేయొద్దంటూ గట్టిగా హెచ్చరించింది కూడా! పూర్తి వివరాల్లోకి వెళ్తే..


Read Also: విరాట్ కోహ్లీ.. దయచేసి ఆ పని చేయకు

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా కింగ్స్‌టౌన్ వేదికగా.. బంగ్లాదేశ్, నేపాల్ (Bangladesh vs Nepal) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా.. మూడో ఓవర్ చేసిన తంజీమ్ నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడేల్ (Rohit Poudel) పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తన బౌలింగ్‌లో డిఫెన్స్ షాట్స్ ఆడుతుండటంతో తంజీమ్ సహనం కోల్పోయి రోహిత్‌పై దూసుకెళ్లాడు. తొలుత అతనివైపు గుర్రుగా చూసిన తంజీమ్.. ఆ తర్వాత ‘ఏంట్రా’ అన్నట్టు అతని మీదకి వెళ్లాడు. అతనిని ఢీకొట్టి, కవ్వింపు మాటలతో చెలరేగిపోయాడు. ఐసీసీ రూల్స్ 2.12 ప్రకారం.. ఎవరైనా ఇలా అనుచితంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు. కాబట్టి.. ఇక్కడ తంజీమ్ రూల్స్ ఉల్లంఘించడంతో ఐసీసీ అతనికి గట్టి షాక్ ఇచ్చింది. తంజీమ్ తప్పు చేశాడని ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో పాటు థర్డ్, ఫోర్త్ అంపైర్లు రిపోర్ట్ ఇవ్వడంతో.. ఐసీసీ అతని ఫీజులో 15 శాతం కోత విధించింది.


Read Also: మ్యాగీ మ్యాన్ అంటూ రోహిత్ శర్మపై ట్రోల్స్

ఇదిలావుండగా.. ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా విజయంలో తంజీమ్ ప్రధాన పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 7 పరుగులే ఇచ్చి, 4 వికెట్లు తీసి నేపాల్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. రోహిత్ పౌడల్ వికెట్‌ని సైతం తంజీమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. తనకు, తంజీమ్‌కి మధ్య నెలకొన్న వివాదం అక్కడితోనే సమసిపోయిందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. తంజీమ్ చాలా గొప్పగా బౌలింగ్ వేశాడని ప్రశంసలూ కురిపించాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 04:00 PM