Samit Dravid: U19 జట్టులో ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడి మొదటి రియాక్షన్ చుశారా..
ABN , Publish Date - Sep 01 , 2024 | 06:06 PM
రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్(samit dravid) భారత అండర్ 19లో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సెలెక్ట్ అయినందుకు సమిత్ ద్రవిడ్ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉందో మీరు చూసేయండి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా(team india) అండర్ 19 జట్టు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ(BCCI) భారత అండర్-19 జట్టును ఇటివల ప్రకటించింది. అందులో భారత జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్‌కు అవకాశం లభించింది. సమిత్ ప్రస్తుతం మహారాజా టీ20 ట్రోఫీలో మైసూరు వారియర్స్ తరఫున ఆడుతున్నాడు. అంతకుముందు కూచ్ బెహార్ ట్రోఫీలో తన ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. తన ఆల్‌రౌండ్ స్కిల్స్‌తో మ్యాచ్‌లో జట్టును గెలిపించగల సత్తా అతనికి ఉందని సెలక్టర్లు భావించారు.
చాలా కష్టపడ్డా
ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్ కన్నడ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో ఓ వీడియో షేర్ చేయబడింది. అందులో సమిత్ ద్రవిడ్ మొదటిసారిగా తన ఎంపిక గురించి మాట్లాడారు. తాను అండర్ 19 జట్టులో ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. జట్టులో తనకు స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో తాను గొప్పగా భావిస్తున్నానని, ఈ క్షణం కోసం చాలా కష్టపడ్డానని పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా నా ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, మరో ముగ్గురు కర్ణాటక ఆటగాళ్లతో పాటు జట్టులో నా పేరు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు సమిత్.
టీ20 ట్రోఫీలో
ఇక సమిత్ ద్రవిడ్ నవంబర్ 10, 2005న జన్మించాడు. ప్రస్తుతం అతని వయస్సు 18 సంవత్సరాల 296 రోజులు. అతను భారతదేశం కోసం తదుపరి అండర్ 19 ప్రపంచ కప్ ఆడలేడు. ఎందుకంటే తదుపరి అండర్ 19 ప్రపంచ కప్ 2026లో జరగాల్సి ఉంది. అప్పటికి అతనికి 20 కంటే ఎక్కువ వయస్సు ఉంటుంది. ఈ కారణంగా అతను పాల్గొనడం సాధ్యం కాదు. మహారాజా T20 ట్రోఫీ మైసూరు వారియర్స్ తరఫున 7 మ్యాచ్‌లు ఆడుతూ సమిత్ 114 స్ట్రైక్ రేట్‌తో 82 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ 33 పరుగులు.
భారత అండర్ 19 జట్టు
వన్డే సిరీస్ కోసం జట్టు: రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్), సాహిల్ పరాక్, కార్తికేయ కేపీ, మహ్మద్ అమన్ (కెప్టెన్), కిరణ్ చోర్మలే, అభిజ్ఞాన్ కుందు (WK), హర్వాన్ష్ సింగ్ పంగాలియా (WK), సమిత్ ద్రవిడ్, యుధాజిత్ గుహా, సమర్థ్ ఎన్, నిఖిల్ కుమార్, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్, రోహిత్ రజావత్, మహ్మద్ అనన్
నాలుగు రోజుల సిరీస్ కోసం జట్టు: వైభవ్ సూర్యవంశీ, నిత్యా పాండ్యా, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్), కార్తికేయ కెపి, సమిత్ ద్రవిడ్, అభిజ్ఞాన్ కుందు (వికె), హర్వాన్ష్ సింగ్ పంగాలియా (వికె), చేతన్ శర్మ, సమర్థ్ ఎన్, ఆదిత్య రావత్, నిఖిల్ కుమార్, అన్మోల్జీత్ సింగ్, ఆదిత్య సింగ్, మొహమ్మద్ అనన్
వన్డే, నాలుగు రోజుల సిరీస్ షెడ్యూల్
1వ ODI - సెప్టెంబర్ 21, 2024
2వ ODI - సెప్టెంబర్ 23, 2024
3వ ODI – సెప్టెంబర్ 26, 2024
మొదటి నాలుగు రోజుల మ్యాచ్ - అక్టోబర్ 03, 2024
రెండవ నాలుగు రోజుల మ్యాచ్ - అక్టోబర్ 07, 2024
ఇవి కూడా చదవండి..
Champions Trophy: టీమిండియాను పాకిస్తాన్‌కు పంపకూడదు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Team India: భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం?
Rahul Dravid:అండర్-19 జట్టులోకి సమిత్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..