Share News

Hardik Pandya: పాండ్యా-నటాషా విడాకుల స్టోరీలో కొత్త ట్విస్ట్.. భలే ప్లేటు తిప్పేసిందే!

ABN , Publish Date - Jun 03 , 2024 | 09:48 PM

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇవ్వబోతున్నాడని.. కొన్ని రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం..

Hardik Pandya: పాండ్యా-నటాషా విడాకుల స్టోరీలో కొత్త ట్విస్ట్.. భలే ప్లేటు తిప్పేసిందే!
Natasa Stankovic Gives Unexpected Twist

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు (Natasa Stankovic) విడాకులు ఇవ్వబోతున్నాడని.. కొన్ని రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీళ్లిద్దరు కోర్టు మెట్లు ఎక్కారని, ఆస్తిలో నటాషా 70% తీసుకోనుందని వార్తలూ వచ్చాయి. దీనిపై ఆ ఇద్దరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. విడాకులు తీసుకోవడం పక్కా అనే వాదనలు బలంగా వినిపించాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాండ్యా ఇంటిని పేరుతో పాటు పెళ్లి ఫోటోలను నటాషా తొలగించడం, ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌కి కూడా ఆమె హాజరుకాకపోవడం వంటివి చూసి.. ఈ విడాకుల వార్తకి మరింత బలం చేకూరింది.


Read Also: విరాట్ కోహ్లీపై సంచలనం.. అలాగైతే జట్టులో ఉండి దండగ!

ఇలాంటి తరుణంలో.. నటాషా ఎవ్వరూ ఊహించని ఓ ట్విస్ట్ ఇచ్చింది. ఇన్ని రోజుల పాటు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తమ పెళ్లి ఫోటోలను ‘ఆర్కైవ్’లో పెట్టిన ఆమె.. ఇప్పుడు వాటిని రీస్టోర్ చేసింది. పెళ్లి ఫోటోలే కాదండోయ్.. పాండ్యాతో కలిసి సరదాగా గడిపిన ఫోటోలను సైతం పునరుద్ధరించింది. దీంతో.. పాండ్యా, నటాషా మళ్లీ కలిసిపోయారా? అని అందరూ చర్చించుకుంటున్నారు. విడాకుల రూమర్లు జోరుగా చక్కర్లు కొట్టిన సమయంలో ఏమాత్రం స్పందించని నటాషా.. ఇప్పుడు ఫోటోలను రీస్టోర్ చేయడాన్ని బట్టి చూస్తే, వారి వివాహ బంధం పదిలంగానే ఉందని అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బహుశా కొన్ని అపార్ధాల కారణంగా ఇద్దరు కొన్నాళ్లు దూరంగా ఉండొచ్చని, ఇప్పుడవి సమసిపోయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.


Read Also: గాల్లో ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఆ తర్వాత ఏమైందంటే?

అయితే.. కొందరు నెటిజన్లు ఈ అంశంపై కాస్త వైల్డ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. ఐపీఎల్ సమయంలో హార్దిక్‌పై తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి కాబట్టి, వాటి నుంచి తప్పించుకొని సానుభూతి పొందడం కోసమే ఈ భార్యాభర్తలిద్దరు భలే డ్రామాలు ఆడారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆ సంగతులు పక్కన పెడితే.. నటాషా ఇప్పుడు పెళ్లి ఫోటోలు రీస్టోర్ చేసింది కాబట్టి, విడాకుల విషయం ఉత్తుత్తుదే అని అర్థం చేసుకోవచ్చు. అయితే.. దీనిపై ఇరువురి నుంచి క్లారిటీ వస్తే గానీ ఏం చెప్పలేం. అటు పాండ్యా మాత్రం.. ప్రస్తుతం తన జీవితంలో కొన్ని సమస్యలు సాగుతున్నాయని, వాటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నాడు. ఈ లెక్కన.. ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ కొలిక్కి వచ్చినట్టేనా?

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 09:48 PM