Tech News: మీ వాహనానికి ఇవి ఉన్నాయా.. లేదంటే మీకే నష్టం..
ABN , Publish Date - Nov 18 , 2024 | 01:59 PM
Tech News: వాహనానికి ఇంజిన్ ఎంత కీలకమో.. వీల్స్, టైర్స్ కూడా అంతే ముఖ్యం. ఇంజిన్ సరిగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటామో.. టైర్లను కాపాడుకునేందుకు కూడా అంతే సేఫ్టీ చర్యలు పాటిస్తాం. టైర్లు సరిగా లేకపోతే..
Tech News: వాహనానికి ఇంజిన్ ఎంత కీలకమో.. వీల్స్, టైర్స్ కూడా అంతే ముఖ్యం. ఇంజిన్ సరిగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటామో.. టైర్లను కాపాడుకునేందుకు కూడా అంతే సేఫ్టీ చర్యలు పాటిస్తాం. టైర్లు సరిగా లేకపోతే.. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి కూడా. అందుకే.. టైర్ల విషయంలో అస్సలు నిర్లక్ష్యం వహించోద్దంటారు. ఇక అసలు మ్యాటర్‌కు వస్తే.. మనం కార్లు, బైక్స్, సైకిల్ టైర్ల వాల్వ్‌కి ప్లాస్టిక్, మెటల్ క్యాప్స్ చూస్తూనే ఉంటాం. టైర్‌కు మధ్యలో వాల్వ్‌కి ఈ క్యాప్స్ ఉంటాయి. వీటినే టైర్ వాల్వ్ స్టెమ్ క్యాప్స్ అంటారు. ప్లాస్టిక్‌తో గానీ.. మెటల్‌తో గానీ వీటిని తయారు చేస్తారు. టైర్లకు ఈ వాల్వ్ స్టెమ్ క్యాప్స్ చాలా ముఖ్యం. ఇవి టైర్లను సంరక్షించడంలో చాలా ఉపకరిస్తాయి. అంతేకాదు.. ఈ వాల్వ్ స్టెమ్ క్యాప్స్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
1. ఈ స్టెమ్ క్యాప్స్.. దూళి, తేమ నుంచి టైర్‌ను, వాల్వ్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది. వాల్వ్ దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాదు.. టైర్లో ఎయిర్ తగ్గకుండా కాపాడుతుంది.
2. ఈ స్టెమ్ క్యాప్స్.. టైర్‌కు రక్షణ కవచంగా పని చేస్తుంది. వీల్, వాల్వ్ దెబ్బతినకుండా కాపాడుతుంది.
3. ప్రయాణించేటప్పుడు రోడ్డుపై ఉన్న దుమ్ము, దూళి, శిథిలాలు టైర్‌కి పట్టుకుంటాయి. ఇలాంటి సమయంలో స్టెమ్ క్యాప్స్.. టైర్ వాల్వ్‌ను శిథిలాల నుంచి రక్షిస్తుంది.
4. ఒకవేళ స్టెమ్ క్యాప్స్ ఊడిపోయినట్లయితే.. దుమ్ము, దూళి, శిథిలాలు టైర్ వాల్వ్ చుట్టూ పేరుకుపోతాయి. ఇది టైర్ వాల్వ్ పాడవడానికి కారణమవుతుంది.
4. దుమ్ము, దూళి కణాలు టైర్ వాల్వ్ లోపలికి వెళ్లే అవకాశం ఉంది. ఇది టైర్‌పై ప్రభావం చూపుతుంది. డ్రైవింగ్ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
5. తక్కువ ఎయిర్ ప్రెజర్ టైర్ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. ఒక్కోసారి ప్రమాదానికి కారణం అవుతుంది. ఈ స్టెమ్ క్యాప్స్ ఉంటే.. ఎయిర్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది. తద్వారా టైర్‌ని రక్షిస్తుంది.
Also Read:
మీరూ ఇలాంటి తప్పు చేయకండి.. కార్ నడిపేటపుడు..
మహిళల వ్యాపార ఆలోచన.. రూ. 5 కోట్ల ప్రభుత్వ సాయం..
ఒకే ప్లేయర్‌తో రెండు సార్లు.. మ్యాచ్‌లో కీలక మార్పులు
For More Trending News and Telugu News..