Share News

Hyderabad: 28 మంది ఐపీఎస్‌ల బదిలీ..

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:09 AM

రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఐపీఎ్‌సలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు నాన్‌ కేడర్‌ ఎస్పీలు కూడా ఉన్నారు.

Hyderabad: 28 మంది ఐపీఎస్‌ల బదిలీ..

  • ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా రితిరాజ్‌

  • సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు హర్షవర్ధన్‌

  • సీఐడీకి విశ్వజిత్‌.. ఐదుగురికి పోస్టింగ్‌ నిల్‌

  • డీజీపీ ఆఫీసులో రిపోర్టుకు ఆదేశం

  • త్వరలో రెండో దశ.. కీలక బదిలీలు అప్పుడే!

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఐపీఎ్‌సలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు నాన్‌ కేడర్‌ ఎస్పీలు కూడా ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా ఉన్న రితిరాజ్‌ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) జాయింట్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. మంచిర్యాల డీసీపీగా ఉన్న అశోక్‌ కుమార్‌ను జగిత్యాల ఎస్పీగా.. అక్కడున్న సన్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రభుత్వం సూర్యాపేట ఎస్పీగా నియమించారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ఉన్న సుబ్బారాయుడితోపాటు మరో నలుగురికి ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు.


పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న పాటిల్‌ సంగ్రామ్‌సింగ్‌ గణాపాత్రో, పి.సాయిచైతన్యకు తాజా బదిలీల్లో పోస్టింగ్‌లు లభించాయి. కొంత మంది ఎస్పీలు, డీసీపీల పనితీరు, వారిపై వచ్చిన ఆరోపణలను తాజా బదిలీల్లో పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్పీ ర్యాంక్‌ అధికారుల్ని బదిలీ చేసిన ప్రభుత్వం రెండో దశలో డీఐజీ.. ఆపై స్థాయి అధికారులను బదిలీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. రెండో దశ బదిలీల్లో కీలక అధికారుల మార్పు ఉండే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

Updated Date - Jun 18 , 2024 | 03:15 AM