Share News

ప్రతీ ఒక్కరు సమాజ సేవల్లో పాల్గొనాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 10:43 PM

ప్రతీ ఒక్కరు సమాజ సేవల్లో పాల్గొనాలని, రక్తధానం ప్రాణధానంతో సమానమని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో మెగా రక్తధాన శిబిరాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ప్రతీ ఒక్కరు సమాజ సేవల్లో పాల్గొనాలి

మంచిర్యాల అర్బన్‌, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు సమాజ సేవల్లో పాల్గొనాలని, రక్తధానం ప్రాణధానంతో సమానమని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో మెగా రక్తధాన శిబిరాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అమరవీరులు రేపటి తరాల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను వెలకట్టలేమని కొనియాడారు. రక్తదానంపై అపోహలను వీడాలని, ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా సరే 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. దాతలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. డీసీపీ ఏ.భాస్కర్‌, ఏసీపీ ఆర్‌.ప్రకాష్‌, టౌన్‌, రూరల్‌ సీఐలు ప్రమోద్‌రావు, అశోక్‌ కుమార్‌, సీఐలు నరేంధర్‌, నరేష్‌ కుమార్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, సెక్రటరి చందూరి మహేంధర్‌, సబ్‌ డివిజన్‌ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

దండేపల్లి, ఆక్టోబరు 23(ఆంధ్రజ్యోతి) : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ నిర్వహించిన రక్తదాన శిబిరంలో బుధవారం మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ రక్తదానం చేశారు. ఆయనతోపాటు మండలానికి చెందిన యువత రక్తదానం చేశారు. డీసీపీ ఎగ్గిడి భాస్కర్‌, ఏసీపీ ప్రకాష్‌ చేతుల మీదుగా సర్టిఫికేట్‌ అందుకున్నారు.

హాజీపూర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం గుడిపేట 13వ బెటాలియన్‌లో మంచిర్యాల వాలంటరీ బ్లడ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కమాండెంట్‌ వెంకటరాములు మాట్లాడుతూ అన్నిదానాల్లో కెల్లా రక్తదానం గొప్పదని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ కాళిదాసు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 10:43 PM