Share News

Khammam Floods: మున్నేరు తగ్గుముఖం.. ఖమ్మం ఊపిరిపీల్చుకో!

ABN , Publish Date - Sep 08 , 2024 | 01:18 PM

ఒకటి కాదు రెండు కాదు పదిరోజులుగా ఖమ్మం ప్రజలను మున్నేరు (Munneru) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు బిక్కుబిక్కుమంటూ బతికిన ఖమ్మం వాసులు (Khammam) ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. మున్నేరు కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్క అడుగు తగ్గి 15 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శనివారం అర్దరాత్రి వరకూ మున్నేరు వేగంగా పెరిగిన సంగతి తెలిసిందే.

Khammam Floods: మున్నేరు తగ్గుముఖం.. ఖమ్మం ఊపిరిపీల్చుకో!
Khammam Munneru

ఖమ్మం : ఒకటి కాదు రెండు కాదు పదిరోజులుగా ఖమ్మం ప్రజలను మున్నేరు (Munneru) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు బిక్కుబిక్కుమంటూ బతికిన ఖమ్మం వాసులు (Khammam) ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. మున్నేరు కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్క అడుగు తగ్గి 15 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శనివారం అర్దరాత్రి వరకూ మున్నేరు వేగంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే.. రాత్రి 2 గంటల నుంచి మున్నేరు తగ్గుతూ వస్తోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఖమ్మం ప్రజల్లో మల్లీ దడ మొదలైంది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు.. మధిర మండలం చిలుకూరు వద్ద రోడ్డుపైకి కట్టలేరు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో.. ఖమ్మం నుంచి ఏపీకి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖమ్మం నగరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఆయన.. వరద బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆహారం, తాగునీరు, వైద్యసాయంపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఎంత ఖర్చు అయినా సరే వెనకాడబోమని భరోసా ఇచ్చారు.


Kishan-Reddy-Khamma.jpg

ఆదుకుంటాం..

మరోవైపు.. ఖమ్మం జిల్లా మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులను పరామర్శించారు. వరదలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపాల్సి ఉందని.. తెలంగాణకు సాయం చేసి.. ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ‘ఇటువంటి విపత్కర పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలి. కేంద్రం రాష్ట్రం వద్ద అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ కింద రూ. 1300 కోట్లు పంపించింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలి. వరదపై రాజకీయం చేయడం సరికాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్నేరు వరద బాధితులకు అండగా ఉంటాయి. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందిస్తాం’ అని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఫ్లైట్‌లో వెళ్లడానికి వాతావరణం అనుకూలించక పోవడంతో ట్రైన్‌లోనే ఖమ్మం వెళ్లిన కిషన్ రెడ్డి.. సుమారు మూడు, నాలుగు గంటలపాటు ఖమ్మం మున్నేరు, పాలేరు నియోజకవర్గంలోని రాకాసి తండలో పర్యటించారు.


ponguleti-srinivas-reddy.jpg

ఒకప్పుడు వేరు..

మరోవైపు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక జిల్లాలు జలమయం అయ్యాయని తెలిపారు. నష్టపోయిన వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇవాళ మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారన్నారు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేసి పంపించాలని కిషన్ రెడ్డి సెక్రటరీని ఆదేశించారన్నారు. ఇక్కడ జరిగిన విపత్తుని దేశ విపత్తుగా తీసుకోవాలని కేంద్రాన్ని పొంగులేటి కోరారు. రాజకీయాలు ముఖ్యం కాదని.. ప్రజలను కాపాడటమే ముఖ్యమని కేంద్రం చేయూత అందిస్తోందన్నారు. తెలంగాణ అంటే గతంలో లాగా ధనిక తెలంగాణ కాదని ప్రధాన మంత్రికి తెలియజేశామన్నారు.

Updated Date - Sep 08 , 2024 | 01:22 PM