Share News

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?

ABN , Publish Date - Jul 30 , 2024 | 01:36 PM

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎంతమంది గులాబీ పార్టీ కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే..

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?

పెద్ద ట్విస్టే..?

  • తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం

  • మళ్లీ బీఆర్ఎస్‌లోకి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి..?

  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన కృష్ణ మోహన్ రెడ్డి

  • కారు పార్టీలోనే ఉంటానని మాటిచ్చినట్లు సమాచారం

  • ఇటీవలే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న గద్వాల్ ఎమ్మెల్యే

  • పార్టీలో చేరుతున్నప్పుడు ఎంతో హైడ్రామా..!


KTR.jpg

ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • త్వరలో బీఆర్ఎస్ అధినేతను కేసీఆర్‌ను కలుస్తానంటున్న ఎమ్మెల్యే

  • నేను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్న కృష్ణ మోహన్

  • కేటీఆర్‌తో భేటీ తర్వాత మీడియాతో గద్వాల ఎమ్మెల్యే చిట్ చాట్

  • నా మీద డీకే అరుణ, సరిత కోర్టులో పిటిషన్ వేశారు

  • నా పక్షాన ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీనే..

  • లాయర్‌ను పెట్టి కోర్టులో వాదించారు : కృష్ణ మోహన్


Congress-MLA.jpg

కేటీఆర్ ఓకే అనేశారుగా!

  • ఇటీవల బీఆర్ఎస్ లాయర్‌ను తొలగించింది

  • లాయర్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ను కోరాను

  • అవసరమైతే లాయర్ ఫీజు నేనే చెల్లిస్తానని కూడా చెప్పాను

  • కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..

  • ఎల్లుండి కోర్టులో వాయిదా ఉంది : గద్వాల్ ఎమ్మెల్యే

Updated Date - Jul 30 , 2024 | 02:22 PM