Share News

Telangana: కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం.. ఆ నియోజకవర్గాలే టార్గెట్‌గా..

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:34 PM

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. 17 రోజుల పాటు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈరోజు నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.

Telangana: కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం..  ఆ నియోజకవర్గాలే టార్గెట్‌గా..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. 17 రోజుల పాటు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈరోజు నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించారు. కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఇక్కడి నుంచి కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్, నల్గొండ, మాడుగులపల్లి మీదుగా మిర్యాలగూడ చేరుకుని సాయంత్రం అక్కడ రోడ్ షోలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు సూర్యాపేట రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తం 17 రోజుల పాటు 12 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. చివరి రోజైన మే పదో తేదీన సిరిసిల్లలో రోడ్​ షో, సిద్దిపేటలో బహిరంగసభ నిర్వహించడంతో బస్సు యాత్ర ముగుస్తుంది.

Harishrao: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా..: హరీష్ రావు


బస్సు యాత్ర ఇలా..

హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో భాగంగా సాయంత్రం సమయంలో రోడ్‌షోలు నిర్వహిస్తారు. ఉదయం రైతుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను సందర్శిస్తూ, రైతులను పరామర్శిస్తూ, వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. సాయంత్రం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు.


17రోజుల పాటు..

కేసీఆర్ 17రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్న నేపథ్యంలో ఆయన ప్రయాణించేందుకు వీలుగా బస్సును తీర్చిదిద్దారు. అవసరమైన చోట వినియోగించుకునేందుకు వీలుగా చిన్న బస్సులనూ సిద్ధం చేశారు. యాత్రకు సంబంధించిన పలువురు నేతలకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. వారు బస్సు యాత్ర, రోడ్ షోకు సంబంధించిన అన్ని అంశాలను సమన్వయపరచి, పర్యవేక్షించనున్నారు. యాత్ర పొడవునా వంద మందికి పైగా వాలంటీర్లు సేవలు అందించనున్నారు. రక్షణ వ్యవస్థ కోసం బౌన్సర్లనూ ఉపయోగించుకోనున్నారు. మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్‌ సాయంత్రం నిర్వహించే రోడ్‌ షో కోసం పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నల్గొండ ఎంపీ సీటును గెలుచుకోవడమే లక్ష్యంగా ఇక్కడి నుంచి కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Loksabha polls: బీఆర్ఎస్‌‌ను వీడటంపై కారణాలేంటో చెప్పిన రంజిత్ రెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Andhra Pradesh News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 03:34 PM