Election Commission: ‘రైతుభరోసా’ నిధుల పంపిణీపై ఈసీ ఆంక్షలు
ABN , Publish Date - May 07 , 2024 | 04:04 PM
Telangana: తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు పంపిణీపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. రైతు భరోసా పథకంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.
హైదరాబాద్, మే 7: తెలంగాణలో (Telangana) రైతు భరోసా (Rythu Bharosa) పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధు పంపిణీపై ఈసీ ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్ (Elections) ముగిసిన తర్వాతే నిధులు విడుదల చేయాలంటూ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా పథకంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ ఈ సందర్భంగా పేర్కొంది.
Delhi Liquor Case: కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు
మే13న పోలింగ్ ముగిసిన తర్వాతనే పెండింగ్ రైతు బంధు నిధులను పంపిణీ చేయాలంటూ ఈ సందర్భంగా ఈసీ స్పష్టంగా పేర్కొంది. ఈ నెల 9న రైతుబంధు నిధులు పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రకటన ఎన్.వేణు కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ ఎన్నికల నియమావళిని ఉల్లంగించారంటూ ఆరోపించారు. దీనిపై స్పందించిన ఈసీ.. రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఎన్నికల తర్వాతే రైతుబంధు నిధులు అంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో రైతు బంధు నిధుల పంపిణీకి బ్రేక్ పడినట్లైంది.
ఇవి కూడా చదవండి..
Delhi Liquor Scam: కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్.. జ్యూడీషియల్ కస్టడీ పొడగింపు..
ఏపీలో పెను సంచలనం.. దుమారం రేపుతున్న తాజా సర్వే.. సోషల్ మీడియాలో వైరల్..!
Read Latest Telangana News And Telugu News